Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం

ABN, Publish Date - May 06 , 2025 | 08:15 AM

విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్‌ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సోమవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 1/9

విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్‌ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సోమవారం నాడు జరిగింది.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 2/9

ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం చేశారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 3/9

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 4/9

తెలంగాణలో పోలీసులు నూటికి నూరుశాతం శాంతిభద్రతలు కాపాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 5/9

దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 6/9

పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 7/9

ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 8/9

విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు అడిషనల్ ఎస్పీ, ఎస్పీల కుటుంబాలకు రూ. కోటిన్నర అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Zee Awards: తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్‌కు జీ అవార్డ్స్-2025 ప్రదానం 9/9

పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వారికి మంచి భవిష్యత్‌ను అందించే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated at - May 06 , 2025 | 08:22 AM