Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్
ABN, Publish Date - Sep 07 , 2025 | 07:27 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం నాడు నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు లోకేష్.
1/9
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలోని నివాసంలో శనివారం నాడు నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కలిశారు.
2/9
సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP), ఇండో యూరో సింక్రనైజేషన్, జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్‌మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) (Overseas Placement scheme) కింద 14మంది నర్సింగ్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కి జర్మనీలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తూ కాల్ లెటర్స్ అందాయి.
3/9
ఈ క్రమంలో వారు లోకేష్‌ను కలిశారు. జర్మనీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
4/9
తొలిబ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణ ఇవ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40మంది ఎంపికయ్యారు.
5/9
అయితే, వారిలో 14 మంది త్వరలోనే జర్మనీ వెళ్లనున్నారు.
6/9
మిగిలిన అభ్యర్థులు కూడా వివిధ దశల్లో శిక్షణ పూర్తి చేస్తున్నారు.
7/9
శిక్షణ పూర్తి అయిన వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
8/9
మన రాష్ట్రం వారికి అంతర్జాతీయస్థాయి ఉద్యోగాలు కల్పించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని లోకేష్ ఉద్ఘాటించారు.
9/9
చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా సీడాప్ - ఓం క్యాప్‌లను ఏపీలో బలోపేతం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Updated at - Sep 07 , 2025 | 07:32 AM