Share News

VRSEC Reunion: అమెరికాలో ఘనంగా VRSEC 1996-2000 బ్యాచ్ రజతోత్సవం

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:22 AM

సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC) 1996-2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19-21 తేదీల్లో అమెరికాలోని లానియర్ ఐలాండ్స్‌లో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వారి కాలేజ్ రోజుల స్నేహబంధాలను, పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు.

VRSEC Reunion: అమెరికాలో ఘనంగా VRSEC 1996-2000 బ్యాచ్ రజతోత్సవం
VRSEC 1996-2000 Alumni Celebration

అమెరికాలోని లేక్ లానియర్ ఐలాండ్స్‌లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (VRSEC) 1996-2000 బ్యాచ్ రజతోత్సవ సమ్మేళనం సెప్టెంబర్ 19-21 తేదీల్లో ఘనంగా జరిగింది. దాదాపు 70 మంది పూర్వ విద్యార్థులు అమెరికా సహా వివిధ దేశాల నుంచి వచ్చి హాజరయ్యారు. ఈ వేడుక కళాశాల రోజులను గుర్తుచేస్తూ, పండుగ వాతావరణంలో జరిగింది.

VRSEC Reunion2.jpg


మూడు రోజుల వేడుకలో ముఖ్య ఘట్టాలు

శుక్రవారం, సెప్టెంబర్ 19: పూర్వ విద్యార్థులు ది గేమ్ ఛేంజర్ పేరుతో సమావేశమై, 12 లేక్ హౌస్‌లలో పురుషులు, మహిళలు వేర్వేరుగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో రాత్రి వరకు స్నేహితులు వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కబుర్లు చెప్పుకున్నారు. లేక్ హౌస్‌లలో గోల్ఫ్ కార్ట్ కూడా ఏర్పాటు చేశారు.

VRSEC Reunion4.jpg

శనివారం, సెప్టెంబర్ 20: ఉదయం గోల్ఫ్ కార్ట్‌లలో ఐలాండ్ చుట్టూ తిరిగి, పికిల్‌బాల్, హైకింగ్‌లో పాల్గొన్నారు. లైవ్ దోశ స్టాల్‌తో బ్రంచ్ ఆస్వాదించి, సేమ్ కలర్ టీ-షర్టులు వేసుకుని గ్రూప్ ఫోటో దిగారు. సాయంత్రం గ్రాండ్ బాల్‌రూమ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పద్మజ భరతనాట్యం, నీరజ జొన్నలగడ్డ కథక్ నృత్యం, లేడీస్ గ్రూప్ తెలుగు డ్యాన్స్, సమరసింహా రెడ్డి స్కిట్, శ్రీకాంత్ తుమ్మూ బోటనీ పాట డ్యాన్స్ ఆకట్టుకున్నాయి.

VRSEC Reunion1.jpg


దివంగత సహ చరలు సునీల్ అడ్డల, ప్రశాంతి, అరవింద్ చిల్లరపులకు నివాళులర్పించారు. హాజరు కాని వారు వీడియో కాల్స్ చేసి వివరాలు తెలుసుకున్నారు. VRSEC వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పరుచూరి వెంకటేశ్వర రావు జూమ్ కాల్‌లో బ్యాచ్‌ను అభినందించి, కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా మారిన విషయాన్ని, నాణ్యతపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. భారత్, యూకే, కెనడా నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు కేక్ కటింగ్ చేశారు. రాత్రి డీజే మ్యూజిక్‌తో 90ల నాటి హిట్ పాటలకు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు.

VRSEC Reunion4.jpg


ఆదివారం, సెప్టెంబర్ 21: వీడ్కోలు బ్రేక్‌ఫాస్ట్‌తో వేడుక ముగిసింది. మళ్లీ కలుసుకునే వాగ్దానంతో జ్ఞాపకాలతో విడిపోయారు. 25 ఏళ్లు గడిచినా కళాశాల రోజులు గుర్తు తెచ్చుకున్నారు. ఈ రీ యూనియన్ మా బంధాన్ని, VRSECతో అనుబంధాన్ని గుర్తుచేసిందని పూర్వ విద్యార్థులు అన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు శ్రీహరి అట్లూరి, ఆశలత వేముగంటి, ఉప్పెన్ చావా, అనిల్ యర్లగడ్డ తదితరులు ఈవెంట్ విజయం కోసం కృషి చేశారు.

VRSEC Reunion3.jpg


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2025 | 11:24 AM