AP Assembly: జీవీఎంసీ పరిధిలో గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యేల ప్రశ్నలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:12 AM
మున్సిపాలిటీలు ప్రతిచోట ఊరు బయట ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. అనకాపల్లిలో మున్సిపల్ ఆఫీసులోనే డంపింగ్ యార్డు ఉందని దాన్ని మార్చాలని అన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 24: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా జీవీఎంసీ రహదారి విస్తరణ, మురుగునీటి పారుదల వ్యవస్థపై ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ (MLA Konatala Ramakrishna) ప్రశ్నించారు. జీవీఎంసీలో విలీనం అయిన గ్రామాల్లో సరైన మౌళిక సదుపాయాలు లేవన్నారు. రోడ్లు, డ్రైనేజీ కనెక్టివిటీకి సమగ్రమయిన ప్రణాళిక రూపొందించాలని కోరారు. అనకాపల్లి జోన్‌కు 300 కాలేజీలు ఉన్నాయని.. మున్సిపాలిటీలు ప్రతిచోట ఊరు బయట ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. అనకాపల్లిలో మున్సిపల్ ఆఫీసులోనే డంపింగ్ యార్డు ఉందని దాన్ని మార్చాలని అన్నారు. మున్సిపల్ ఆఫీసు ఊరు మధ్యలో ఉంటుంది గనుక అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ , మున్సిపల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరారు.
కావాలంటే వాటిని పీపీపీ కింద నిర్మించినా సరిపోతుంది అభిప్రాయపడ్డారు. జోనల్ కమిషనర్‌లకు అధికారం ఇవ్వాలని.. వారికి శాంక్షనింగ్ అథారిటీ ఇస్తే పనులు ముందుకు వెళతాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తరువాత మంత్రి నారాయణనే ఎక్కువ కష్టపడుతున్నారని అన్నారు. అనకాపల్లిలో ఆల్టర్‌నేటివ్ స్ధలాలు చూపించామని.. అధికారులు అంగీకరిస్తే మార్చొచ్చని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వెల్లడించారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ.. టీడీఆర్ విషయంలో వేసిన విజిలెన్స్ ఎంక్వైరీ ఎంత వరకూ వచ్చిందని అడిగారు. వేకెంట్ ల్యాండ్ టాక్స్ వసూలు చేయకుండా బిల్డింగ్ ప్లాన్‌లు ఇచ్చి ఆక్యుపెన్సీ సర్టిపికెట్‌లు ఇచ్చారన్నారు. వీరిపై ఏం చర్యలు తీసుకుంటారు చెప్పాలన్నారు. కేంద్రం, జీవీఎంసీ నిధులతో విశాఖకు తాగునీరు అవసరాలు ఎలా తీర్చుతారని ప్రశ్నించారు. డీఆర్సీ మిటీంగ్‌లో 2019-24 మధ్య అసలు విశాఖలో శానిటేషన్‌ను పట్టించుకోలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.
నగరాలకు రోడ్ల విస్తరణకు ఇచ్చినదే టీడీఆర్ అని... ఇప్పుడు దాన్ని మొత్తాన్ని దెబ్బతీశారని అన్నారు ఎమ్మెల్యే గుణబాబు. గత పాలకులు చేసిన దాన్ని సరిచేయడానికి ఇప్పటికే సంవత్సరం అయ్యిందని వెల్లడించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక కమిటీ ఫాం చేసి అన్ని రెవన్యూ, మున్సిపల్, ఏపిఐఐషి, ఇరిగేషన్‌ల నుంచి ప్రతినిధులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖకు ఎంత వాటర్ వస్తున్నాయి... ఎంత సప్లై అవుతుందో చూడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
దసరాకు సిద్ధమవుతున్న సీఆర్డీఏ భవనం.. పరిశీలించిన మంత్రి
Read Latest AP News And Telugu News