Amaravati CRDA Building: దసరాకు సిద్ధమవుతున్న సీఆర్డీఏ భవనం.. పరిశీలించిన మంత్రి
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:38 AM
విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. భవనానికి విద్యుత్ సంబంధిత పనులన్నీ రేపటిలోగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు.
అమరావతి, సెప్టెంబర్ 24: అమరావతిలో సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Minister Gottipati Ravikumar) ఈరోజు (బుధవారం) ఉదయం పరిశీలించారు. దసరా సందర్భంగా ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంబంధిత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భవనానికి విద్యుత్ సంబంధిత పనులన్నీ రేపటిలోగా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. పరిపాలనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల సౌకర్యాలు ఏర్పడేవని చెప్పుకొచ్చారు. రైతులు చేసిన భూ త్యాగం మరువలేమని.. వారికిచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ న్యాయస్థానం ఇచ్చేది కాదన్నారు. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బయటకు వచ్చినందుకు ఇవాళ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకు వెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో అంటూ జగన్‌పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి..
కలరా విజృంభణ.. అధికారుల అప్రమత్తం
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
Read Latest AP News And Telugu News