Road Accident: మహిళ ప్రాణం తీసిన గుంత
ABN , Publish Date - Oct 08 , 2025 | 07:08 PM
రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో..
రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన అనిత తన భర్తతో కలిసి బైక్ పై నవ్జే అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇద్దరు స్వగ్రామానికి బైకుపై బయలు దేరారు. ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న గుంతను గమనించకపోవడంతో బైకు ఒక్కసారిగా అందులో పడింది. దీంతో వెనుక కూర్చొన్న అనిత ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్‌పై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 12 కోట్లు ఖర్చు చేసి ఆ రోడ్డుకు మరమ్మతులు చేసినా.. గుంతలు ఏర్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా నాలుగు రోజుల క్రితం 55 ఏళ్ల వ్యక్తి కూడా మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ
సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..
Read Latest Telangana News and National News