PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:46 PM
ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుండి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేసారు.
ముంబై: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 (Navi Mumbai International Airport)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ (Adani Airports), సిడ్కో (CIDCO) మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు. హెవీ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ 3.25 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండనుంది. ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని బహుళ విమానాశ్రయ వ్యవస్థ ద్వారా గ్లోబల్ సిటీస్‌లో ముంబై ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు.
ముంబై మెట్రోలైన్-3
కాగా, ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుంచి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేశారు.
ముంబై వన్ యాప్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ముంబై వన్ యాప్‌ను కూడా ప్రారంభించారు. తద్వారా ప్రయాణికుల పలు ప్రయోజనాలు పొందవచ్చు. నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో షార్ట్-టర్మ్-ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను కూడా ప్రధాని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టుకు విజయ్
సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్..
Read Latest Telangana News and National News