Share News

Nitish Kumar: ఎప్పటికీ ఎన్డీయేతోనే ఉంటా.. మోదీ సమక్షంలో నితీష్..

ABN , Publish Date - Sep 15 , 2025 | 08:44 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిస్తే నితీష్‌ను సీఎం చేసే విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి ప్రకటన చేయకుండా సంయమనం పాటించారు. అయితే నితీష్ మాత్రం ప్రధానమంత్రి పట్ల తన విధేయతను చాటుకున్నారు.

Nitish Kumar: ఎప్పటికీ ఎన్డీయేతోనే ఉంటా.. మోదీ సమక్షంలో నితీష్..
PM Narendra Modi

పూర్ణియా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను(Bihar Assembly Elections) ఈసీ ప్రకటించేందుకు మరో పక్షం రోజులే ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆ రాష్ట్రంలో సోమవారం నాడు పర్యటించారు. ఈ ఏడాది ఆయన బిహార్‌లో పర్యటించడం ఇది తొమ్మిదో సారి. ప్రధానిగా ఆయన రాష్ట్రంలో పర్యటించడం ఇది 55వ సారి. గతంలో ఏ ప్రధాని రాష్ట్రంలో ఇన్నిసార్లు పర్యటించినది లేదు. ఈసారి రూ.36,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను పూర్ణియాలో ప్రధాని ప్రారంభించారు.


నితీష్ పేరు ప్రకటించని ప్రధాని

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిస్తే నితీష్‌ను సీఎం చేసే విషయంలో ప్రధాని ఎలాంటి ప్రకటనా చేయకుండా సంయమనం పాటించారు. అయితే నితీష్ మాత్రం ప్రధానమంత్రి పట్ల తన విధేయతను చాటుకున్నారు. గతంలో పార్టీలు మార్చి తప్పిదాలు చేశానని, ఇకెంతమాత్రం అలా చేసేది లేదన్నారు. ఎన్డీయేతోనే ఉంటానని మోదీకి భరోసా ఇస్తున్నానంటూ ఆయనకు ముకుళిత హస్తాలతో తెలియజేశారు. నితీష్ కుమార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లారని మోదీ తన ప్రసంగంలో ప్రశంసించినప్పటికీ నితీష్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా గుంభనగా వ్యవహరించారు.


కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో డబుల్ గ్రోత్ సాధ్యమవుతుందని మోదీ అన్నారు. బంగ్లాదేశ్ నుంచో నేపాల్ నుంచే అక్రమంగా ఇక్కడకు వచ్చి సెటిల్ అయిన వారు స్థానికుల ఉద్యోగులను కొల్లగొడుతున్నారని, అక్రమ వలసదారులు ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సిందేనని అన్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, జితిన్ రామ్ మాంఝీ సైతం ప్రధాని సభలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

రాత్రికి భారత్ వస్తున్న అమెరికా ప్రతినిధి

దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం

For National News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 09:36 PM