India-US trade deal: రాత్రికి భారత్ వస్తున్న అమెరికా ప్రతినిధి
ABN , Publish Date - Sep 15 , 2025 | 07:33 PM
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడంతో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధి భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలిగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా ప్రతినిధి (US Chief Negotiator), ట్రంప్ సహాయకుడు, దక్షిణ-మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ (Brenden Lynch) సోమవారం రాత్రి భారత్‌కు రానున్నారు. మంగళవారం రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు జరుగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడంతో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధి భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత మార్చి నుంచి అమెరికా-భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకూ ఐదు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. ఆరో రౌండ్ కోసం యూఎస్ బృందం ఇప్పటికే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ అది రద్దయింది. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా మధ్య చర్చలు కొనసాగుతాయని ట్రంప్ గతవారం ప్రకటించారు. మోదీ తనకు మంచి మిత్రుడని, రాబోయే వారాల్లో ఆయనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లేడేందుకు ఎదురుచూస్తున్నట్టు మోదీ వెంటనే బదులిచ్చారు. ఈ క్రమంలో బ్రెన్డన్ లించ్ భారత్ రానుండటం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి..
దేశంలోని చొరబాటుదారులను వెనక్కి పంపుతాం
అక్రమ పద్ధతులని తేలితే మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేస్తాం... సుప్రీం కీలక వ్యాఖ్యలు
For National News And Telugu News