Share News

Wife Attack On Husband: ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపిన భార్య

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:22 AM

క్షణిక సుఖం కోసం భర్తలను, కన్న పిల్లలను చంపే మహిళలు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో గొంతు కోసి చంపింది. తాజాగా ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ జరిగింది.

Wife Attack On Husband: ప్రియుడితో కలిసి భర్త గొంతు కోసి చంపిన భార్య
Crime News

క్రైమ్ న్యూస్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరిగింది. ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం కావడం, ఇతరులపై వ్యామోహం పెంచుకోవడం వంటి వివిధ కారణాలతో ఈ అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. క్షణిక సుఖం కోసం భర్తలను, కన్న పిల్లలను చంపే మహిళలు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో గొంతు కోసి చంపింది. తాజాగా ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


బహ్రైచ్ జిల్లాలో అలీనగర్ ప్రాంతానికి చెంది జకీర్ అలీ(35), హసీనా బేగం(30)(A woman from Bahraich)కి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కుటుంబంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇది ఇలా ఉంటే.. కొత్తకాలం క్రితం హసీనా బేగం అబ్దుల్ సలాం(20) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వీరి అక్రమ సంబంధం(extramarital affair) తెలిసిన జకీర్... హసీనాను గట్టిగా హెచ్చరించాడు. దీంతో తమ వివాహేతర బంధంకు భర్త అడ్డుగా ఉన్నాడని, అతడి చంపేందుకు హసీనా ప్లాన్ వేసింది.


అక్టోబర్ 24వ తేదీన జాకీర్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు అబ్దుల్ ను ఇంటికి పిలిపించింది. ఇద్దరు కలిసి దుప్పటి ముఖంపై ఒత్తి.. కత్తితో గొంతు కోసి చంపారు. అనంతరం డెడ్ బాడీని ఇంటి ముందు ఉన్న ఓ షెడ్ లో పడేశారు. ఆ తర్వాత హసీనా బేగం నేరుగా పోలీస్ స్టేషన్(Police Sation) కు వెళ్లి.. జకీర్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. జకీర్ మామ ఆసిఫ్ అలీ, ఆయన బంధుులు రోజాన్, నఫీస్ లో భూ వివాదాల కారణంతో తన భర్తను చంపారని ఫిర్యాదులో పేర్కొంది.


కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వారి మధ్య భూ వివాదాలు లేవని విచారణలో వెల్లడైంది. దీంతో దర్యాప్తును జకీర్ భార్య హసీనా వైపు నుంచి పోలీసులు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో ఆదివారం హసీనాను, అబ్దుల్ అలీని పోలీసులు అరెస్ట్(Police arrested) చేసి విచారించారు. తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇక ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందానికి ఎస్పీ రామ్ నయన్ సింగ్ రూ. 20 వేల నగదు బహుమతి ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

పట్టాలపై కూర్చున్న పెద్దాయన.. దూసుకొచ్చిన రైలు.. చివరకు ఏమైందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 10:55 AM