Share News

సోనమ్ రఘువంశీ కేసులో కొత్త ట్విస్ట్..! సంజయ్ వర్మ ఎవరు? 234 కాల్స్ ఎందుకు చేసింది?

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:25 PM

Meghalaya Missing Couple Latest Update: రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసుల విచారణలో మరో కొత్త పేరు బయటకొచ్చింది. సోనమ్ రఘువంశీ ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం పెళ్లికి ముందు సంజయ్ వర్మ అనే వ్యక్తితో 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు ఎందుకు కాల్ చేసింది అన్నది సస్పెన్స్ గా మారింది.

సోనమ్ రఘువంశీ కేసులో కొత్త ట్విస్ట్..! సంజయ్ వర్మ ఎవరు? 234 కాల్స్ ఎందుకు చేసింది?
Sanjay Verma or Raj Kushwaha The Truth Behind Sonam's Mysterious Calls

Sanjay Verma Sonam Raghuvanshi Case: రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ సంచలన హత్య కేసులో ఆరవ పేరు తెరపైకి వచ్చింది. సోనమ్ రఘువంశీ ఫోన్ నుండి లభించిన ఆధారాల ప్రకారం సంజయ్ వర్మ అనే మరో వ్యక్తి గురించి పోలీసులు కీలక నిజాలు బయటపెట్టారు. సోనమ్ కు సంజయ్ తో ఉన్న సంబంధంపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో.. ఆ వ్యక్తి మరెవరో కాదని, రాజా రఘువంశీ హత్యకు పథకం వేసిన సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. పెళ్లికి ముందు సంజయ్ వర్మ అనే వ్యక్తితో 39 రోజుల వ్యవధిలో ఏకంగా 234 సార్లు కాల్ చేసింది ప్రేమికుడికే అని అనుమానిస్తున్నారు.


కాల్ డేటాతో సీక్రెట్ రివీల్..

సోనమ్ రఘువంశీ మొబైల్ కాల్ రికార్డుల నుంచి షిల్లాంగ్ పోలీసులకు షాకింగ్ ఇన్‌పుట్ లభించింది. హత్యకు ముందు సోనమ్ సంజయ్ వర్మ అనే అబ్బాయితో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. మార్చి 1 నుంచి మార్చి 25 మధ్య ఆమె సంజయ్ వర్మకు 234 సార్లు కాల్ చేసింది. అంటే వారు దాదాపు ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు సార్లు కనీసం 30 నుండి 60 నిమిషాలు మాట్లాడుకున్నారని రికార్డులు చూపిస్తున్నాయి. పోలీసుల ప్రకారం, ఇది సాధారణ పరిచయం కాదు. పోలీసుల కథనం ప్రకారం, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్ రాజ్ నంబర్‌ను 'సంజయ్ వర్మ' అని సేవ్ చేసుకుంది. అలాగే సోనమ్ సోదరుడు గోవింద్ 'సంజయ్' అనే వ్యక్తితో తనకు పరిచయం లేదని పోలీసుల విచారణలో వెల్లడించారు. కాగా, సంజయ్ మొబైల్ నంబర్ చివరిసారిగా వాట్సాప్‌లో జూన్ 8న యాక్టివ్‌గా ఉంది. ఆ రోజే సోనమ్ పోలీసుల ముందు లొంగిపోయింది. కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు.


సంజయ్ వర్మ ఎవరు?

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సంజయ్ వర్మ ఎవరు? ఈ హత్య కుట్రలో అతడి పాత్ర ఉందా? లేక సోనమ్‌కు సహాయం చేస్తున్నాడా? లేక రఘువంశీ హత్యకు నిజమైన సూత్రధారి ఇతనేనా? తెరవెనుక ఉండి ఆదేశాలు మాత్రమే ఇచ్చాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ట మే 11న వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ వెళ్లాక రోజుల తరబడి ఆచూకీ తెలియలేదు. దీంతో నవవధూవరుల మిస్సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. జూన్ 2న రాజా మృతదేహం కనిపించాక కేసు అనూహ్య మలుపు తిరిగింది. సోనమ్ కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో, ఆమె జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో కనిపించాక షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిందనే నిజం బయటపడింది. తర్వాత ఆకాశ్ రాజ్‌పుత్, విశాల్ సింగ్ చౌహాన్ ఆనంద్ కుర్మి అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


ఆనాటి నుంచి పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. తాజాగా సంజయ్ వర్మ అనే కొత్త పేరు తెరపైకి రావడంతో కేసు పరిష్కారం కాకుండా మరింత క్లిష్టంగా మారింది. జూన్ 11న, సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సోనమ్‌తో తమ కుటుంబం అన్ని సంబంధాలను తెంచుకుందని ఆమె సోదరుడు గోవింద్ అన్నారు. రాజా కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ కేసులో న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే

Read Latest Telangana News and National News

Updated Date - Jun 19 , 2025 | 06:14 PM