RSS Chief Mohan Bhagwat: 3 వేల ఏళ్ల క్రితం ప్రపంచాన్ని నడిపించాం.. కానీ ఏ దేశాన్ని వశపరచుకోలేదు
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:04 PM
మూడు వేల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని మోహన్ భగవత్ అన్నారు.
ఇండోర్: మూడు వేల ఏళ్ల క్రితమే భారతదేశం (India) ప్రపంచనాన్ని నడిపించిందని, కానీ ఏ ఒక్క దేశాన్ని వశపరచుకోవడం కానీ, ఇతరుల వాణిజ్యాన్ని అణగదొక్కడం కానీ చేయలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. భారత్ ఎక్కడికి వెళ్లినా ఆ దేశానికి నాగరికత, జ్ఞానం పంచిందని తెలిపారు. ప్రహ్లాద్ పటేల్ రాసిన 'నర్మద పరిక్రమ' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
'మనం ప్రపంచాన్ని నడిపించాం. ఏదేశాన్ని లోబరుచుకోలేదు. ఎవరి వాణిజ్యాన్ని దెబ్బతీయలేదు. మనం ఎవరినీ కన్వర్ట్ చేయలేదు. ఎక్కడకు వెళ్లినా నాగరితక, జ్ఞానం పంచాం. పవిత్ర గ్రంథాలు చదివి జీవితాన్ని మెరుగుపరుచుకున్నాం. ప్రతి దేశానికి సొంత ఐడెంటిటీ ఉంటుంది. ప్రతీదీ అక్కడే ఉంటుంది. అయితే వారి మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు అది లేదు' అని మోహన్ భగవత్ అన్నారు. మన పూర్వీకుల దూరదృష్టి, స్వచ్ఛమైన మనోభావాల కారణంగా 3,000 ఏళ్ల క్రితం భారతదేశం ఉత్తమ దేశంగా నిలబడిందని అన్నారు. 3 వేల సంవత్సరాలు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని అన్నారు.
ఎదుగుదలను చూసి భయంతోనే..
మోహన్ భగవత్ శుక్రవారంనాడు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ, ఇండియా ఎదుగుదల చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయని, భారతదేశం అభివృద్ధి చెందితే మన స్థానం ఎక్కడ ఉంటుందో అని ప్రపంచ శక్తులు భయపడుతున్నాయని అన్నారు. ఆ భయంతోనే ఇండియాపై సుంకాలు విధిస్తున్నాయని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి