iPhone 17 Sale Viral Video : ఐఫోన్లా మజాకా.. 17 సిరీస్ కోసం రాత్రంతా పడిగాపులు, కొట్లాటలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 03:53 PM
ఆపిల్ ఫోన్ల 17 సిరీస్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి షురూ అయ్యాయి. ముంబైలోని ఆపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ల అభిమానులు క్యూ లైన్లు కట్టి రాత్రంతా పడిగాపులు కాశారు. ఈ క్రమంలో తోపులాటలు, తొక్కిసలాట దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ముంబై, సెప్టెంబర్ 19: స్మార్ట్ ఫోన్లలో రారాజుగా చెబుతున్న ఆపిల్ ఫోన్ 17 సిరీస్(iPhone 17) అమ్మకాలు షురూ అయ్యాయి. ఈ రోజు (శుక్రవారం) ఉదయం నుంచి ఐఫోన్ 17 సిరీస్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఫోన్ల సేల్స్ శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ముంబైలోని బండా కుర్లా కాంప్లెక్స్‌లోని ఆపిల్ స్టోర్ దగ్గర ఐఫోన్ల అభిమానులు గురువారం రాత్రంతా పడిగాపులు కాశారు. భారీగా క్యూ లైన్లు కట్టి నిల్చున్నారు. మార్నింగ్ స్టోర్ తెరిచిన వెంటనే కొత్త ఐఫోన్ 17 వేరియంట్ ముందుగా సొంతం చేసుకోవాలని అష్టకష్టాలు పడ్డారు.
అయితే, ఈ క్రమంలో గుంపులుగా వచ్చిన కొందరు యువకులు క్యూలైన్లలో(Q Lines) చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో ఫోన్ల కోసం రాత్రంతా క్యూలైన్లలో వేచి ఉన్న వినియోగదారులు ప్రతిఘటించారు. ఈ మేరకు అక్కడ తోపులాటలు, తొక్కిసలాట జరిగింది. దీంతో సెక్కూరిటీ సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. టెక్ ఔత్సాహికుల అత్యుత్సాహంతో షాపు ముందు కోలాహల వాతావరణం నెలకొంది.
అయితే అక్కడి గందరగోళానికి సంబంధించిన వీడియోలను వార్తా సంస్థ (PTI) సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్(Viral Video)గా మారాయి. కాగా, టెక్ దిగ్గజం ఆపిల్.. భారతదేశమంతటా కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. దీంతో ముంబై, ఢిల్లీలోని ఆపిల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ల వెలుపల పెద్ద సంఖ్యలో టెక్ ఔత్సాహికులు, ఆపిల్ ఫోన్ల అభిమాన వినియోగదారులు, యువత భారీగా క్యూలు కట్టారు. అందరికంటే ముందుగా కొత్త ఐఫోన్ సీరిస్ సొంతం చేసుకోవాలని ఉబలాటపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి