Share News

Iran Vs Israel War: ఇరాన్‌లో అణు స్థావరాలపై దాడి.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..

ABN , Publish Date - Jun 23 , 2025 | 01:34 PM

ఇరాన్‌లోని ప్రధాన అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో అణు స్థావరాల నుంచి రేడియోధార్మికత వెలువడితే భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Iran Vs Israel War: ఇరాన్‌లో అణు స్థావరాలపై దాడి.. భారత్‌కు పొంచి ఉన్న ముప్పు..

న్యూఢిల్లీ, జూన్ 23: ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలు.. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌‌పై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపింది. అయితే ఫోర్డ్ అణుకేంద్రంపై దాడి కారణంగా.. ఆ ప్రభావం భారత్‌తోపాటు పొరుగుదేశం పాకిస్థాన్‌పై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అందుకు కారణం.. మధ్య ఆసియా నుంచి వీచే గాలులు.. భారత ఉప ఖండాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకాచెప్పాలంటే.. చెర్నోబిల్ విషాదం లేదా ఫుకుషిమా ప్రమాదం వలే దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు.

ఇరాన్ అణు కేంద్రాలపై దాడి జరిగితే రేడియోధార్మిక వ్యర్థాలు విడుదలవుతాయి. ఈ వ్యర్థాలు గాలితో కలిసి భారత్‌తో సహా మొత్తం ఆసియా ఖండానికి వ్యాపిస్తాయి. అసలు అయితే భారత్.. జేట్ స్ట్రీమ్, పశ్చిమ గాలుల మార్గంలో ఉంది. ఇందులో వ్యర్థాలు గాలితోపాటు ఇతర దేశాలకు వ్యాపిస్తాయి. ఈ విషపూరిత గాలి 140 కోట్లకు పైగా ప్రజలను నివసించే ప్రాంతాలను ప్రభావితం చేయనుంది.


ఇంతకీ జెట్ స్ట్రీమ్ అంటే ఏమిటి..?

న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సనా రెహ్మాన్ చెబుతున్న మాటల ప్రకారం.. జెట్ స్ట్రీమ్ అనేది ట్రోపోస్పియర్‌పై పొరల ద్వారా అడ్డంగా ప్రవహించే జియోస్ట్రోఫిక్ గాలి. ఇది సాధారణంగా 20 వేల నుంచి 50 వేల అడుగుల ఎత్తులో పశ్చిమం నుంచి తూర్పు వైపునకు వీస్తుంది. వివిధ ఉష్ణోగ్రతలతో గాలులు కలిసే చోట జెట్ స్ట్రీమ్ అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా జెట్ స్ట్రీమ్ ఎక్కడ ఏర్పడుతుందో నిర్ణయిస్తుంది. అంటే జెట్ స్ట్రీమ్ అనేది పశ్చిమ గాలుల్లో ఒక భాగం. ఇవి ఎగువ ట్రోపోస్పీయర్‌లో కేంద్రీకృతమై ఉంటాయి.


జెట్ స్ట్రీమ్‌కీ, పశ్చిమ గాలుల మధ్య తేడా ఏమిటి ?

జెట్‌స్ట్రీమ్‌లు, వెస్టర్లీలు.. రెండూ భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే వాతావరణ ప్రవాహాలు. జెట్ స్ట్రీమ్ అనేది ఎగువ ట్రోపోస్పియర్‌లో పశ్చిమం నుంచి తూర్పు వైపునకు ప్రవహించే వేగంగా కదిలే గాలికి సంబంధించిన ఇరుకైన ప్రవాహం. ఇక వెస్టర్లీలు.. ఇవి మధ్య అక్షాంశాలలో పశ్చిమం నుంచి తూర్పునకు వీచే గాలులు. అయితే ఈ జెట్ స్ట్రీమ్‌లు.. తుఫానులు, వాతావరణంలో వేగవంతమైన మార్పులతో సహా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి. అంటే తీవ్రమైన చలి లేదా తీవ్రమైన వేడి గాలులను కలిగిస్తాయి.


అణు దాడి నుంచి రేడియేషన్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికం..

డాక్టర్ సనా రెహ్మాన్ వ్యాఖ్యల ప్రకారం.. అణు దాడి నుంచి రేడియేషన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ రేడియేషన్ అనారోగ్యానికి దారి తీస్తుంది. అంతేకాకుండా మరణానికి సైతం దారి తీస్తుంది.


రేడియోధార్మిక కణాలు 5 వేల కిలోమీటర్లు ప్రయాణించి..

భారత్‌కు పశ్చిమాన ఇరాన్ ఉందని డాక్టర్ సనా రెహ్మాన్ వివరిస్తున్నారు. యుద్ధ సమయంలో రేడియోధార్మిక కణాలు లీక్ అయితే.. ఆ పశ్చిమ గాలులు ఈ విష కణాలను ఆప్ఘానిస్థాన్, పాకిస్థాన్, భారత్ వైపు వస్తాయి. దీంతో ఈ నష్టాన్ని ఇరాన్ మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచం ఈ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఇక కణాలు జెట్ స్ట్రీమ్‌తో కలిస్తే.. అవి దాదాపు 9 నుంచి 15 కిలోమీటర్లుపైకి ప్రయాణించగలవు. దీంతో అవి ఆసియాలోనే కాకుండా.. మొత్తం ప్రపంచానికి వ్యాపించగలవు. చెర్నోబిల్ సంఘటన నేపథ్యంలో రేడియోధార్మిక పదార్థాలు 5 వేల కిలోమీటర్లు మేర ప్రయాణించి.. యూరప్‌కు వ్యాపించాయి. అనంతరం యూరప్‌లో థైరాయిడ్ క్యాన్సర్ కేసులు అధికమయ్యాయని వివరించారు.


ఇరాన్ నుంచి రేడియోధార్మిక కణాలు భారత్‌కు ఎలా వస్తాయంటే..

ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం వల్ల మధ్య ప్రాచ్యానికి మాత్రమే హాని జరగదు. ఇది భారత్ గాలి, నీరు, నేలతోపాటు భవిష్యత్తుు సైతం నాశనం చేస్తుంది. ఈ రేడియోధార్మిక కణాలు ఈ జెట్ ప్రవాహాలు.. పశ్చిమ గాలుల ద్వారా భారత్ చేరుకోగలవు.


అమెరికా నిఘాలో ఇరాన్ అణు కేంద్రాలు..

అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ కొన్ని ప్రత్యేక అణు కేంద్రాలను కలిగి ఉంది. ఉదాహరణకు.. నాటాంజ్ (ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు), ఫోర్డో (ఇది భూగర్భంలో నిర్మించారు), అరక్ (ఇక్కడ భారీ నీటి రియాక్టర్ ఉంది), ఇస్ఫహాన్ (ఇక్కడ యురేనియం మార్చబడుతుంది).


పశ్చిమ గాలులతోపాటు జెట్‌స్ట్రీమ్‌లు ఇలా వస్తాయి..

గాలి పడమర నుండి తూర్పు వైపునకు వీస్తుంది. ఇది 30° మరియు 60° అక్షాంశాల మధ్య వీస్తుంది. ఈ గాలి రేడియోధార్మిక వ్యర్థాలను వేగంగా వ్యాపింపజేస్తుంది. ఇరాన్‌లో అణు వ్యర్థాలను విడుదల చేస్తే.. అది గాలితో పాటు పాకిస్తాన్, ఉత్తర భారతవనికి వ్యాపిస్తుంది.


భారత్‌లోని ఈ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు..

  • పంజాబ్, హర్యానా: ఈ రాష్ట్రాలు ఇరాన్‌కు దగ్గరగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ధాన్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రేడియోధార్మిక వ్యర్థాలు ఇక్కడ వ్యాపిస్తే.. రబీ పంట నాశనం కావచ్చు. దీంతో ధాన్యం కొరత ఏర్పడే అవకాశముంది.

  • న్యూఢిల్లీ, ఎన్‌సీఆర్: ఢిల్లీలో ఇప్పటికే గాలి చాలా కలుషితమైంది. రేడియోధార్మిక వ్యర్థాలు ఇక్కడికి వస్తే.. అది మరింత తీవ్రంగా పరిణమించ వచ్చు.

  • రాజస్థాన్: ఇక్కడ గాలి పొడిగా ఉంటుంది. రేడియోధార్మిక ధూళి భూమిలోకి వెళ్లవచ్చ. ఇది చాలా ఏళ్ల పాటు నేలలో అలాగే ఉండనుంది.

  • ఉత్తరప్రదేశ్, బిహార్: గాలి ఇక్కడికి సతం రేడియోధార్మిక కణాలను తీసుకు వస్తుంది. తాగు నీరుతోపాటు వరి పంటలను సైతం పాడు చేస్తుంది.

  • హిమాలయాలు: ఇది గాలిలోకి వ్యాపిస్తే.. అది హిమానీనదాలు, మంచును కలుషితం చేస్తుంది. దీంతో దేశంలోని పవిత్ర నదులను సైతం రేడియోధార్మికతగా మారుస్తుంది.


ఫోర్డో లేదా ఇస్ఫహాన్‌పై దాడి మరింత భయంకరమైనది

ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతంగా జరుగుతుందని చెబుతోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) దీనిని పర్యవేక్షిస్తుంది. కానీ, ఇరాన్ చాలా సంవత్సరాలుగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. అలాగే అనేక రహస్య కార్యకలాపాలు సైతం జరిగాయి. ఇరాన్ ఇంకా వేరే ఏదో చేస్తోందని ఇది సూచిస్తుంది. ఈ స్థావరాలపై దాడి జరిగితే, రేడియోధార్మిక పదార్థాలు గాలిలో వ్యాపించవచ్చు. ముఖ్యంగా భూమిపైన నిర్మించిన ఇస్ఫహాన్ లేదా భూగర్భంలో నిర్మించిన ఫోర్డోపై దాడి జరిగితే, దాని ప్రభావం వినాశకరమైనదిగా పరిణమిస్తుంది.


ఇంతకీ చెర్నోబిల్ అణు ప్రమాదమంటే.. ?

1986, ఏప్రిల్ 26వ తేదీన రష్యాలోని ప్రిప్యాట్ సమీపంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌‌లోని నాల్గవ రియాక్టర్‌లో అణు ప్రమాదం జరిగింది. ఇది అత్యంత దారుణమైన అణు ప్రమాదం. ఇది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండింటిలోనూ జరిగింది. జపాన్‌లోని ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రంలో సైతం ఈ తరహా విపత్తు సంభవించింది.

ఇవి కూడా చదవండి:

యూఎస్‌లో ఆందోళనలు.. పలు నగరాల్లో హై అలర్ట్

ఆ పార్టీ నేతలను రప్పా రప్పా జైలులో వేయాలి: బీజేపీ ఎంపీ

For More International News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 01:37 PM