Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:34 PM
ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్, డిసెంబర్ 26: ఇటీవల కాలంలో భార్య భర్తను, భర్త భార్యను హత్య చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని మేడిపల్లి ప్రాంతంలో 36 ఏళ్ల మహిళ.. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం గుండె పోటుతో చనిపోయాడంటూ తెగ యాక్టింగ్ చేసింది. ఇదిఇలా ఉంటే తాజాగా ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(Uttar Pradesh crime news)లోని గోరఖ్ పూర్ ప్రాంతంలో అర్జున్, ఖుష్బూ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇటీవల పెళ్లై కాగా.. అర్జున్ లుథియానాలో కూలీ పనులు చేస్తుండే వాడు. డిసెంబర్ 21న సొంత ఊరు అయిన గోరఖ్ పూర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో తన భార్య ఫోన్ ను రహస్యంగా వాడటం గమనించాడు. వెంటనే ఆ ఫోన్(phone dispute murder) తనకు ఇవ్వాలంటూ ఖుష్బూను హెచ్చరించాడు. అయితే ఆమె మాత్రం అర్జున్ కు ఫోన్ ఇవ్వకుండా దాచిపెట్టుకుంది. ఈ క్రమంలో ఆ రాత్రి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన అర్జున్, ఖుష్బూను గొంతు కోసి చంపేశాడు.
అనంతరం ఈ హత్య ఎవరికీ తెలియకుండా ఉంచేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంటి వెనుక భాగంలో ఆరు అడుగుల గొయ్యి తవ్వి అందులో ఖుష్బూ డెడ్ బాడీని పూడ్చిపెట్టాడు. అనంతరం ఖుష్బూ ఇంటి నుంచి పారిపోయినట్లు ఇరు కుటుంబ సభ్యులను నమ్మించాడు. అయితే మృతురాలి తండ్రి.. తన కుమార్తె మిస్సైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా.. అర్జున్ చేసిన హత్య వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..