Share News

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:59 AM

హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: కూతురిని చూసి వెళ్తుండగా.. కబళించిన మృత్యువు

- స్కూటీని ఢీకొన్న కారు..

- భార్య మృతి, భార్తకు గాయాలు

హైదరాబాద్: చదువుతున్న కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతుల్లో భార్య మృతిచెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ కథనం ప్రకారం.. సూర్యాపేట(Suryapet) జిల్లా ఎండ్లపల్లి గ్రామం కనేరానగర్‌కు చెందిన కోల్‌ వ్యాపారి సపావత్‌ నారాయణ తన భార్య సపావత్‌ పద్మ(38)తో కలిసి హయత్‌నగర్‌ కుంట్లూరులో ఉన్న నారాయణ కళాశాలలో చదువుతున్న కూతురును చేసేందుకు స్కూటీపై గురువారం వచ్చారు.


city8.2.jfif

తిరుగు పయనంలో గౌరెల్లి వద్ద అతివేగంతో వచ్చిన కారు, స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న పద్మ తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు నారాయణకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నాగోల్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.


సోదరుడి కోసం వెళ్తూ... కానరానిలోకాలకు

- బైక్‌ను ఢీకొన్న స్కూటీ, యువకుడి మృత్యువాత

మన్సూరాబాద్‌: సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌(Nagole Police Station) పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... నాగోల్‌ అజయ్‌ నగర్‌ కాలనీలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి యాటల దుర్గా ప్రసాద్‌(29) తన ద్విచక్ర వాహనంపై ఉప్పల్లోని చిలుకా నగర్‌ కు చెందిన యాటల శివకార్తీక్‌ అనే సోదరుడిని తీసుకెళ్లడానికి నాగోల్‌ చౌరస్తా వైపు వెళ్తున్నాడు.


సుజాత హోటల్‌ సమీపంలో తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన దుర్గా ప్రసాద్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. దుర్గాప్రసాద్‌ సోదరుడు శివ కార్తీక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 10:59 AM