Rekha Gupta: సీఎం బహిరంగ సభలో నినాదాలు.. ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:32 PM
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి గాంధీనగర్‌లోని ట్రేడర్లతో గొడవపడ్డాడు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: రెండ్రోజుల క్రితం తన అధికారిక నివాసంలో 'జన్ సున్‌వాయి' నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మరచిపోక ముందే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) మరో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. గాంధీనగర్‌లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతుండగా ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ ఇద్దరినీ అదుపులోనికి తీసుకున్నారు. దాడి ఘటన అనంతరం సీఎం ప్రజల ముందుకు రావడం ఇదే మొదటిసారి.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి గాంధీనగర్‌లోని ట్రేడర్లతో గొడవపడ్డాడు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు. కాగా, అలజడి సృష్టించిన వ్యక్తిని ప్రవీణ్ శర్మ (60)గా గుర్తించామని, బీజేపీలో 40 ఏళ్లుగా పనిచేస్తున్నట్టు, గాంధీనగర్ ఎమ్మెల్యే అర్వీందర్ సింగ్ లవ్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు అతను తెలిపాడని డీసీపీ షాహదర చెప్పారు. బారికేడ్ల వెనుక నుంచి అతను ఈ చర్యకు పాల్పడ్డాడని, వెంటనే అతన్ని అక్కడినుంచి తొలగించామని చెప్పారు. ఎలాంటి భద్రతా ఉల్లంఘన జరగలేదన్నారు.
సీఎం భద్రత పెంపు
దాడి ఘటన అనంతరం రేఖాగుప్తా భద్రతను పెంచారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆమెకు భద్రత కల్పిస్తున్నాయి. భద్రతా వలయం ఇన్నర్ పెరామీటర్‌లో సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పిస్తుండగా, ఔటర్ పెరామీటర్‌లో ఢిల్లీ పోలీసులు రక్షణగా ఉంటారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
‘శ్రీరామ్’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు.. పర్యాటకుడి ఆరోపణ
For More National News And Telugu News