Share News

Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే..

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:03 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనాభా లెక్కల ప్రక్రియకు రూ. 11,718 కోట్ల బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా జనాభా, డెమోగ్రఫిక్ వివరాలు సేకరణకు సహాయపడుతుంది. ఇంకా..

Union Cabinet Key Decisions: కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే..
Union Cabinet Key Decisions

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనగణన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో తీసుకున్న అంశాలను వివరించారు.


కీలక నిర్ణయాలు ఇవే..

1. 2027లో రెండు విడతల్లో జరగనున్న జనగణన కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది.ఈ జనగణనను డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించనున్నారు.

2. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు 'పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన' (Pujya Bapu Grameen Rozgar Yojana) గా మారుస్తూ నిర్ణయం

3. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పని దినాలను 100 నుంచి 120 రోజులకు పెంచింది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించింది. రూ.1.51 లక్షల కోట్లు కేటాయింపు.

4. బొగ్గు గనుల్లో పలు సంస్కరణలు తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

5. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన.. ఈ పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

6. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల(Kendriya Vidyalayas) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్ కి 4 మంజూరు చేసింది.

7. నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

8. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి NCDC కింద రూ.2,000 కోట్ల ఆర్థిక సహాయం

9. పీఎం కిసాన్ సంపద యోజన.. ఈ పథకానికి రూ.6,520 కోట్లు కేటాయింపు.

10. క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అదనంగా రూ.4,000 కోట్ల నిధులు కేటాయింపు


11. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)లకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్ సిగ్నల్

12. దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడనాకి సైబర్ దాడులను నిరోధించడానికి సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం.

13. సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,000 కోట్లు కేటాయింపు. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సహాయం పెంపు.

14. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించడానికి ఆమోదం

15. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక (Launch Pad) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

16. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితి పెంపు

17. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందించడానికి నేషనల్ టెలి-మెడిసిన్ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆమోదం

18. నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.35,000 కోట్లతో ఒక కొత్త జాతీయ మిషన్‌ను ప్రారంభించేందుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది.

19. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ సేవలు. ఇందుకోసం అదనంగా రూ.8,000 కోట్ల నిధులు కేటాయింపు

20. రాష్ట్రాల ఆర్థిక బలోపేతం కోసం ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో భాగంగా రాష్ట్రాలు తమ మూలధన పెంచుకోవడానికి.. వడ్డీ లేని రుణాల రూపంలో రూ.1.3లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్


ఈ వార్తలు కూడా చదవండి:

Rivaba Jadeja: మా ఆయనకు చెడు అలవాట్లు లేవు కానీ.. రవీంద్ర జడేజా భార్య వ్యాఖ్యలతో కాంట్రవర్సీ

Lulu Group Chairman: మీరు సూపర్ సామీ.. ఓటు వేసేందుకు ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం..!

Updated Date - Dec 12 , 2025 | 05:21 PM