Share News

Lulu Group Chairman: మీరు సూపర్ సామీ.. ఓటు వేసేందుకు ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం..!

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:19 PM

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు గొప్ప ఆయుధం. ఓటింగ్‌తో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొందాలి.. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి. కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Lulu Group Chairman: మీరు సూపర్ సామీ.. ఓటు వేసేందుకు ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం..!
Lulu Group Chairman

ఇంటర్నెట్ డెస్క్: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఓ పునాది.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే వజ్రాయుధం. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండాలని అనుకుంటే ఏ ఎన్నికైనా ఓటు వేయడం మీ కర్తవ్యం. ఒక్క ఓటుతో ప్రజా ప్రతినిధుల తలరాతలు మార్చే బ్రహ్మాండమైన ఆయుధం సామాన్య పౌరుడి వద్ద ఉంటుంది. అందుకే ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఓటు విలువ తెలిసిన ఓ వ్యాపారవేత్త తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3వేల కిలోమీటర్లు విమానం ప్రయాణం చేసివచ్చారు. అది కూడా స్థానిక ఎన్నికల కోసం.. ఇది వింటానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మరి విమానం, హెలికాప్టర్ లో వచ్చి ఓటు వేసిన ఆ వ్యాపారవేత్త ఎవరో తెలుసా?.. అతనే లూలు గ్రూప్ అధినేత ఎం.ఎ.యూసఫ్ అలీ.


కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. గల్ఫ్ దేశాల్లో తన వ్యాపార సామాజ్య్రాన్ని విస్తరించి ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన యూసఫ్ అలీ వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి స్థానిక ఎన్నికల్లో పాల్గొనడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. డిసెంబర్ 11న చివరి విడతలో భాగంగా యూసఫ్ అలీ తన సొంత ఊరు త్రిస్సూర్‌ జిల్లా నట్టికాకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదట తన ప్రైవేట్ జెట్ లో బయలుదేరి కొచ్చి విమానాశ్రయానికి వచ్చారు.


ఆ తర్వాత పోలింగ్ కేంద్రానికి హెలికాప్టర్ లో బయలుదేరారు. ఆయన చిన్నతనంలో చదువుకున్న మోప్లా ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ.. 'నేను ఎక్కడ ఉన్నా.. పోలింగ్ సమయానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటా. నా ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో గర్వంగా ఉంది' అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Funny Viral Video: నిషేధిత ప్రాంతంలో సిగరెట్ తాగుతున్న వ్యక్తికి.. ఎవరు ఎలాంటి శిక్ష వేశారో చూస్తే..
viral video: చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ.. యువకుడిపై ట్రాన్స్ జెండర్ల దాష్టికం

Updated Date - Dec 12 , 2025 | 04:20 PM