Bihar Elections: బ్లాక్ బోర్డు గుర్తుపై తేజ్‌ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పోటీ
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:07 PM
బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అంతికతమవుతూ, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ తెలిపారు. బిహార్‌లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
పాట్నా: బిహార్ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్లాన్‌ను ప్రకటించారు. తన రాజకీయ పార్టీకి జన్‌శక్తి జనతా దళ్ (Janshakti Janata Dal) అని పేరు పెట్టగా, ఎన్నికల గుర్తుగా బ్లాక్ బోర్డు (Black Board) ఉండనుంది. పార్టీ పోస్టర్‌ను తన అధికారిక "ఎక్స్' ఖాతాలో ఆయన షేర్ చేసారు.
బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అంతికతమవుతూ, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ తెలిపారు. బిహార్‌లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
'జన్‌శక్తి జనతా దళ్' పోస్టర్‌లో ఐదుగురు ప్రముఖ నేతలు చేటుచేసుకున్నారు. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్‌లు ఇందులో ఉన్నారు. అయితే తేజ్‌ప్రతాప్ తండ్రి లాలూ ప్రసాద్ ఫోటో ఈ పోస్టర్‌లో చోటుచేసుకులేదు. సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, పూర్తి మార్పు పార్టీ సందేశంగా తెలిపింది. ప్రజాశక్తి, ప్రజాపాలన, బిహార్ అభివృద్ధికి పాటుపడతామని తెలిపింది. జన్‌శక్తి జనతా దళ్‌లో చేరాలనుకునే వారి కోసం మొబైల్ నెంబర్‌ను పోస్టర్‌లో ఇచ్చింది.
పోటీ ఎక్కడి నుంచి?
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు తేజ్ ప్రతాప్ తెలిపారు. 2015లో ఇక్కడ్నించే ఆయన పోటీ చేసి గెలుపొందారు. ఇది తన కర్మభూమి (ల్యాండ్ ఆఫ్ వర్క్) అని, మహువా నుంచి ఇంకెవరు పోటీ చేసినా ప్రజలు ఓడిస్తారని అన్నారు. గత ఏడాది తేజ్‌ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి లాలూప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. గత 12 ఏళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తేజ్‌ప్రతాప్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో లాలూ ఫ్యామిలీ చిచ్చుపెట్టంది.
ఇవి కూడా చదవండి..
మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ
అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో ఎంఎన్‌ఎం పోటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి