PM Modi: మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:35 PM
బిహార్ ఎన్డీయే ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ప్రారంభమైంది. మహిళా సాధికారికత కోసం స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బిహార్ (Bihar)లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన (Mahila Rojgar Yojana) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున రూ.7,500 కోట్ల మొత్తాన్ని వాళ్ల ఖాతాలోని నేరుగా బదిలీ చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇతర మంత్రుల సమక్షంలో వర్చువల్ తరహాలో న్యూఢిల్లీ నుంచి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.
'నవరాత్రి ఉత్సవాల తరుణంలో బిహార్ మహిళల సంతోషంలో భాగస్వామ్యం అవుతున్నా. లక్షలాది మంది మహిళల ఆశీస్సులే మాకు కొండంత బలం. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా' అని మోదీ వర్చువల్ మీట్‌లో పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మహిళా యోజన పథకాన్ని ప్రారంభమిస్తున్నామని, ఈ పథకంలో ఇంతవరకూ 75 లక్షల మంది మహిళలు చేరారని, వీరందరికీ రూ.10,000 చొప్పున వారివారి అకౌంట్లలో జమ చేశామని చెప్పారు.
బిహార్ కోసం పనిచేస్తున్నాం
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో చేశామని, ప్రధాని సైతం మహిళల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఎన్నడూ మహిళలను పట్టించుకోలేదన్నారు. లాలూను తొలగించినప్పుడు ఆయన తన భార్యను ముఖ్యమంత్రిని చేశారని, తన కుటుంబం గురించే లాలూ ఆలోచన చేశారని మండిపడ్డారు. తాము అలా కాదని, బిహార్ అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.
బిహార్‌లోని అధికార ఎన్డీయే ప్రభుత్వం చొరవతో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పథకం ప్రారంభమైంది. స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ఈ పథకం కింద ప్రతి ఇంటిలోని ఒక మహిళకు జీవనోపాధి కల్పనకు ఆర్థికసాయం అందిస్తారు. తొలి విడతగా రూ.10,000, ఆ తర్వాత దశల వారిగా రూ.2లక్షల వరకూ ఆర్థిక సాయం అందిస్తారు.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్త సర్ పై పార్టీలతో ఈసీ భేటీ
అసెంబ్లీ ఎన్నికల్లో పది స్థానాల్లో ఎంఎన్‌ఎం పోటీ..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి