PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్న మోదీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 02:51 PM
ప్రధాన మంత్రి తన స్కూల్ రోజుల్లో ఎదురైన కొన్ని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ''నేను స్కూలులో చదువుతున్నప్పుడు నా చేతిరాత (హ్యాండ్ రైటింగ్) మెరుగుపరచేందుకు టీచర్లు చాలా కృషి చేశారు. టీచర్లు చేతిరాతలో నిపుణులో కానీ నేను అంతగా కాదు'' అని మోదీ నవ్వుతూ చెప్పారు.

న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వినూత్న శైలిలో వారితో శుక్రవారం ముఖాముఖీ సంభాషించారు. పరీక్షలకు సంబంధించిన అనుమానాలు, వత్తిడి, ఆందోళనకు సంబంధించి విద్యార్థులతో ఆయన ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపారు. తన స్కూల్ డేస్‌లో ఎదురైన అనుభవాలను వారితో పంచుకున్నారు. ''పరీక్షా పే చర్చా'' ఎనిమిదో ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీలోని సుందర్ నర్సరీ విద్యార్థినీ విద్యార్థులతో మోదీ సంభాషించారు.
Breaking News: ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
ప్రధాన మంత్రి తన స్కూల్ రోజుల్లో ఎదురైన కొన్ని అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ''నేను స్కూలులో చదువుతున్నప్పుడు నా చేతిరాత (హ్యాండ్ రైటింగ్) మెరుగుపరచేందుకు టీచర్లు చాలా కృషి చేశారు. టీచర్లు చేతిరాతలో నిపుణులో కానీ నేను అంతగా కాదు'' అని మోదీ నవ్వుతూ చెప్పారు. ప్రధానితో సమావేశం కావడం పట్ల విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒక ప్రధానితో మాట్లాడుతున్నట్టు తమకు అనిపించలేదని, ఆయన ఒక స్నేహితుడుగా తమతో సంభాషించారని విద్యార్థులు చెప్పారు. కేరళ, పంజాబ్, బీహార్, త్రిపుర సహా పలు రాష్ట్రాల విద్యార్థులతో మోదీతో ముఖాముఖీలో పాల్గొన్నారు.
ఒక విద్యార్థి తన ''దిల్ కా బాత్'' చెప్పేందుకు ఎక్స్‌ప్రెస్‌లో వచ్చానని చెప్పడంతో మోదీ తడుపుకోకుండా సమాధానం ఇచ్చారు. "నేను నా మనసులో మాటల చెబుతాను. నవ్వు నీ 'దిల్ కే బాత్' చెప్పు'' అన్నారు. విద్యార్థులకు ప్రధాన విలువైన సూచనలు ఇస్తూ, పరీక్షలు వస్తున్నాయని ఆందోళన పడవద్దని, ఎలాంటి ఆందోళన లేకుండా చక్కగా పరీక్షలు రాయాలని అన్నారు.
ఈ ఏడాది 'పరీక్షా పే చర్చా' వినూత్న ఫార్మెట్‌లో, స్టయిల్‌లో నిర్వహిస్తున్నారు. బోర్డు పరీక్షల్లో కూర్చునే విద్యార్థులతో మరికొందరు ప్రముఖులు కూడా ముఖాముఖీ ముచ్చటిస్తున్నారు. వీరిలో దీపికా పదకొనే, మోరీ కోమ్, అవని లేఖరా, రుజుట దివేకర్, సోనాలి సబర్వాల్, ఫుడ్‌ఫార్మెర్, విక్రాంత్ మస్సే, భూమి పెడ్నేకర్, టెక్నికల్ గురూజీ, రాధికా గుర్తా తదితరులు విద్యార్థుల సాధికారతా జర్నీలో పాలుపంచుకుంటున్నారు.
విద్యార్థులతో ప్రధాని మోదీ ఏటా ముఖాముఖీ జరిపే ఈ ఈవెంట్‌ను టౌన్ హాల్ ఫార్మెట్‌లో భారత్ మండపంలో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటిరసీ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో సంభాషించిన "పరీక్షా పే చర్చా'' 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి