Deputy CM: ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై స్టే
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:23 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధిపై ఇటీవల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంభందించి సుప్రీంకోర్టు స్టే విధించింది

- సనాతన ధర్మంపై వ్యాఖ్యల వ్యవహారం...
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi)కి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2023 సెప్టెంబరులో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారులు చెన్నైలో నిర్వహించిన సనాతన ధర్మం నిర్మూలన మహానాడులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులతో పోల్చుతూ వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ తెచ్చిన పంచాయతీ.. తల్లీ కూతుళ్లు అదృశ్యం
ఈ వ్యవహారంలో మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక, జమ్ము-కశ్మీర్(Maharashtra, Bihar, Karnataka, Jammu and Kashmir) తదితర రాష్ట్రాల్లో ఉదయనిధి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. అలాగే, పలు హిందూ సంస్థలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఈ కేసులన్నింటినీ ఒకటిగా మార్చి, ఆ కేసు విచారణ మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఉదయనిధి తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఉదయనిధి కోర్టులో హాజరు మినహాయింపు కల్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టింది. ఉదయనిధికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడానికి విధించిన తాత్కాలిక స్టే కొనసాగుతుందని ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణ ఏప్రిల్ 28వ తేదీకి వాయిదావేసింది. అలాగే, కేసుకు సంబంధించి పిటిషనర్లు అఫిడవిట్లు దాఖలుచేయాలని ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో ఉదయనిధిపై కొత్త కేసుల నమోదుకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News