BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల విజేతలు వీరే
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:28 PM
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవంల 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారంనాడు వెలువడ్డాయి. నవంబర్ 11న పోలింగ్ జరుగగా, ఈరోజు ఫలితాలు ప్రకటించారు. తెలంగాణ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. జమ్మూలోని నగ్రోటా, ఒడిశాలోని నౌపడలో బీజేపీ గెలుపొందింది. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆప్ నిలబెట్టుకుంది. బడ్గాంలో పీడీపీ, మిజోరంలో ఎంఎన్ఎఫ్ విజయ సాధించాయి.
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ డిపాజిట్ చతికిల పడింది. రాజస్థాన్‌లోని అంటా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,612 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జమ్మూలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి దేవయాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఒడిశాలోని నౌపడ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జై దొలాకియా విజయం సాధించారు.
మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవంల 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థి 68,235 ఓట్లు దక్కుంచుకుని గెలుపు సొంతం చేసుకున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ 22,473 ఓట్లు, సాద్ అభ్యర్థి సుఖ్వీందర్ కౌర్ 7,158 ఓట్లు, బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు 3,042 ఓట్లు సాధించారు. కాగా, జార్ఖాండ్‌ని ఘట్సిల ఉప ఎన్నికలో జేఎంఎం అభ్యర్థి సోమేశ్ చంద్ర విజయం సాధించారు.
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.