CM Stalin: ఆత్మగౌరవమే మా ప్రాణం.. హక్కులను హరిస్తే ఊరుకోం
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:40 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్ర ఎంకే స్టాలిన్ మరోసారి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, అది పూర్తిగా కాషాయ విద్యావిధానమంటూ.. అందుకే దానిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే ప్రసక్తే లేదని

- ఆ కాషాయ విద్యావిధానాన్ని అంగీకరించేది లేదు
- తిరువళ్లూరు సభలో సీఎం స్టాలిన్
చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేది కాదని, అది పూర్తిగా కాషాయ విద్యావిధానమని, అందుకే దానిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) మరోమారు సుస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం పేరుతో త్రిభాషా విద్యావిధానాన్ని, నిర్బంధ హిందీ అమలు చేయడానికి, పునర్విభజన సాకుగా లోక్‌సభ స్థానాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ రాష్ట్రమంతటా బుధవారం నిరసన సభలు జరిగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Dy CM: పిల్లల్ని కనండి.. కానీ...
తిరువళ్లూరు జిల్లా తిరుపాచ్చూరు కేపీఎస్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన నిరసన సభలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయినుండే నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధంగా, కులవృత్తులను ప్రోత్సహించేలా, దేశమంతటా హిందీ భాషకు పట్టం కట్టేలా ఉండటం వల్లే జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ కాషాయ విద్యావిధానాన్ని అమలు చేయకపోతే నిధులివ్వమంటూ కేంద్రంలోని బీజేపీ పాలకులు బెదరిస్తున్నారని, విద్యా శాఖ మంత్రి తమిళ ఎంపీలను, తమిళులను అనాగరికులంటూ విమర్శించి తన స్థాయిని దిగజార్చుకున్నారని, డీఎంకే ఎంపీల తీవ్ర నిరసనల కారణంగా అప్పటికప్పుడు ఆ మంత్రి తన మాటను ఉపసంహరించుకున్నారని చెప్పారు.
తమిళులు ఎన్నో దశాబ్దాలుగా నాగరికులుగానే వ్యవహరిస్తున్నారని, వారికి ఆత్మగౌరవం ఎక్కువని, కేంద్రానికి ఎప్పుడూ బానిసలు వ్యవహరించరన్నారు. మదురై ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసి ఏడేళ్లయినా ఓ ఇటుక కూడా వేయకుండా ఉండటమే నాగరికమా? రాష్ట్రంలో తుఫాను, వర్షబాధితులను ఆదుకోవటానికి రెండేళ్లుగా నిధులివ్వకపోవడం నాగరికమా? హిందీభాషను నిర్బంధం చేయకపోతే నిధులిచ్చే ప్రసక్తేలేదంటూ రాష్ట్రాన్ని బెదరించడం నాగరికమా? పదేళ్లుగా తమ అడుగులకు మడుగులొత్తని రాష్ట్రాలపై కక్షసాధింపు చర్యలు పాల్పడటమే నాగరికమా? అంటూ స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నరేంద్రమోదీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఉభయసభల్లో డీఎంకే సభ్యులు పాలకుల అవినీతి, అరాచకాలను ఎండగడుతుండటం చూసి భయపడటం వల్లే లోక్‌సభ స్థానాలను తగ్గించేందుకు కేంద్రంలోని బీజేపీ పాలకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికే దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయదలిచానని చెప్పారు. ఈ సభలో మంత్రి ఆవడి ఎస్‌ఎం నాజర్, డీఎంకే తిరువళ్లూరు తూర్పు జిల్లా శాఖ ఇన్‌చార్జి ఎంఎస్కే రమేష్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News