Dy CM: పిల్లల్ని కనండి.. కానీ...
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:13 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. కొత్తగా పెళ్ళిచేసుకునే దంపతులు వెంటేనే పిల్లల్ని కనండి, కానీ ఎక్కవ మందిని కనొద్దటూ.. పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తున్నారని కూడా ఉదయనిధి అన్నారు.

- కొత్త దంపతులకు ఉదయనిధి హితవు
చెన్నై: కొత్తగా పెళ్ళిచేసుకునే దంపతులు వెంటేనే పిల్లల్ని కనండి, కానీ ఎక్కవ మందిని కనొద్దని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. ఏళ్లతరబడి కుటుంబ నియంత్రణ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాన్ని అన్ని విధాలా శిక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. డీఎంకే చెన్నై తూర్పు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం కలైవానర్ అరంగంలో దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు పర్యవేక్షణలో 72 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఈ వేడుకలకు ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి 72 రకాలైన సారెవస్తువులను కానుకగా అందించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సమక్షంలో ఈ వివాహం చేసుకున్న జంటల్లో మతాంతర వివాహాలు చేసుకున్నవారు, ప్రేమవివాహాలు చేసుకున్నవారు అధికంగా ఉండటం తనకెంతో సంతోషం కలిగిస్తోందని చెప్పారు. తనది కూడా ప్రేమ వివాహమని, తన కుటుంబంలోనూ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికమని, తన తాత కరుణానిధి ప్రేమ వివాహాలను, ఆదర్శ వివాహాలను ఎక్కువగా ప్రోత్సహించేవారని చెప్పారు.
మహిళాభ్యుదయం కోసం పాటుపడుతూ మహిళల ఆదరాభిమానాలను అధికంగా పొందుతుండటం చూసి ఓర్వలేకే కేంద్రంలోని బీజేపీ పాలకులు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తున్నారని ఉదయనిధి ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలోని ప్రజావ్యతిరేక ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో రాష్ట్రాన్ని దండించడానికి సిద్ధపడుతోందని,
ఒక వేళ దేశవ్యాప్తంగా లోక్‌సభ సభ్యులను 800లకు పైగా పెంచినా జనాభా నిష్పత్తి ప్రకారం 22 లోక్‌సభ స్థానాలకు బదులుగా 10 స్థానాలనే పెంచాలని కుట్ర పన్నుతున్నారని, ఇలా నియోజకవర్గాల సంఖ్యను తగ్గించినా, పెంచినా రాష్ట్రమే నష్టపోవడం ఖాయమన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే తాను నూతన వధూవరులను వెంటనే పిలల్ని కనమని చెబుతున్నానన్నారు. పుట్టబోయే బిడ్డలకు అందమైన తమిళంలో పేర్లు పెట్టాలని ఉదయనిథి విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News