Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి వేడుకలకు రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:29 PM
ఈనెల 31న ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ప్రకటించారు. ఈ ఉత్సవాలకు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించామని, ఆయన తన సమ్మతి తెలియజేశారని చెప్పారు.
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారంనాడు అయోధ్య (Ayodhya)లో పర్యటించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాజ్‌నాథ్ సింగ్ షేర్ చేశారు. ఈనెల 31న తాను అయోధ్యలో ఉంటానని, శ్రీరామజన్మభూమి తీర్ధ క్షేత్రను దర్శించి, ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాల్లో పాల్గొంటానని తెలిపారు.
ఈనెల 31న ప్రాణప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల ప్రకటించారు. ఈ ఉత్సవాలకు రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించామని, ఆయన తన సమ్మతి తెలియజేశారని చెప్పారు. రక్షణ మంత్రి హాజరైతే సీఎం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి ఉత్సవాల్లో రెండోరోజు శ్రీరామ జన్మభూమి మందిర్‌లో యజ్ఞాలు నిర్వహించనున్నారు. తత్వ కలశ్, తత్వ హోమం, మన్యు సూక్త హోమం, రామ్ తారక మంత్ర హోమం నిర్వహిస్తారు. సాయంత్రం పల్లకి ఊరేగింపు నిర్వహిస్తారు. విశ్వప్రసన్న తీర్థ జీ మహరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. గత నెలలో శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి