Khaleda Zia: ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్
ABN , Publish Date - Dec 30 , 2025 | 07:54 PM
బేగం ఖలీదా జియా (80) సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఢాకా అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమె 36 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా (Khaleda Zia) అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ (Dr S Jaishankar) హాజరవుతున్నారు. ఇందుకోసం బుధవారంనాడు ఆయన ఢాకా బయలుదేరి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో జైశంకర్ ఢాకా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
బేగం ఖలీదా జియా (80) సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఢాకా అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన ఆమె 36 రోజులుగా చికిత్స పొందుతున్నారు. దేశ తొలి మహిళా ప్రధానిగా బంగ్లాదేశ్ అభివృద్ధి, భారత్‌తో సత్సంబంధాలకు జియా విశేష కృషి చేశారు.
బేగం ఖలీదా జియా మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-బంగ్లా సంబంధాల బలోపేతానికి బేగం ఖలీదా జియా చేసిన కృషిని ప్రశంసించారు. ఆమె కుటుంబానికి, బంగ్లా ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 2015లో ఢాకాలో ఆమెతో ఒక సమావేశంలో పాల్గొన్నానని, ఆమె గొప్ప దార్శనికురాలని గుర్తుచేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యం కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి