Sindhoor Success: ఆర్మీ, వైమానిక నేవీ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - May 07 , 2025 | 08:28 AM
Sindhoor Success: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేపట్టింది.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Sindhoor Success) విజయవంతం (Success) తర్వాత ఆర్మీ (Army), వైమానిక నేవీ చీఫ్ (Navy Chiefs)లతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడారు. ఆపరేషన్ స్థితి, భవిష్యత్తు వ్యూహంపై త్రివిధ దళాధిపతులతో ఆయన చర్చించారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా త్రివిధ దళాలు దాడులు చేశాయి. భారత్, పాక్ సరిహద్దుల్లో పరిస్థితులను రక్షణ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది. రక్షణ సంబంధిత అన్ని సంస్థలతో రక్షణ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తోంది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేస్తోంది. ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహావల్‌పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 2019లో బాలాకోట్‌లో దాడి తర్వాత అతిపెద్ద సైనిక చర్య అని తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీసీఎస్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు సమాచారం.
Also Read: భారత్ ఆపరేషన్ సింధూర్.. Live
కాగా పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు సంసిద్ధంగా ఉండేందుకు బుధవారం నుంచి పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాక్ డ్రిల్ ద్వారా వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించడం, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, బ్లాక్అవుట్ చర్యలను అమలు చేయడం వంటి మొదలైన కీలక కార్యకలాపాలు నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్
For More AP News and Telugu News