Rahul Gandhi: ఓట్ చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబ్ .. రాహుల్ నోట మళ్లీ అదేమాట
ABN , Publish Date - Sep 20 , 2025 | 06:20 PM
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తు్న్న వారికి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. గత గురువారంనాడు కూడా మీడియా సమావేశంలో ఆయన కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటాను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను ఒక పద్ధతిప్రకారం తొలగించారని ఆరోపించారు
వయనాడ్: భారత ఎన్నికల కమిషన్ (ECI)పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజా విమర్శల దాడి చేశారు. కర్ణాటకలో 'ఓట్ చోరీ' (Vote Chori)కి సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్ర సీఐడీకి ఇవ్వలేదని ఆరోపించారు. కేరళలోని వయనాడ్‌లో మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, సీఐడీ పదేపదే వివరాలు ఇవ్వాలని కోరినా ఎన్నికల కమిషన్ ముఖం చాటేసినట్టు చెప్పారు.
'ఇంతకంటే పెద్ద నేరారోపణ ఏమి ఉంటుంది? పోలీసులు సమాచారం అడిగారు, వాళ్లు ఇవ్వలేదు. ఇది నా స్టేట్‌మెంట్ కాదు, ఇది నిజం. ఇది ఆధారాలతో సహా చాలా స్పష్టంగా ఉంది' అని రాహుల్ పేర్కొన్నారు.
హైడ్రోజన్ బాంబ్ బహిర్గతం చేస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓట్ చోరీ చేసి గెలిచారనడంలో ఎవరికీ సందేహం లేదని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన హైడ్రోజన్ బాంబును త్వరలోనే బహిర్గతం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఆధారాలు లేకుండా ఏదీ మాట్లాడనని చెప్పారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తు్న్న వారికి ఎన్నికల కమిషన్ కొమ్ముకాస్తోందని రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తున్నారు. గత గురువారంనాడు కూడా మీడియా సమావేశంలో ఆయన కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డాటాను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను ఒక పద్ధతిప్రకారం తొలగించారని ఆరోపించారు. కాగా, రాహుల్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పూర్తిగా నిరాధారమంటూ తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి..
మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై రాహుల్ గాంధీ..
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..