Share News

Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 04:26 PM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని, అందువల్లే చైనా ఇక్కడ మకాం వేసిందని అన్నారు.

Rahul Gandhi: దేశంలో మకాం వేసిన చైనా: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఉత్పత్తి ఆధారిత దేశంగా భారత్ విఫలమై దానిని చైనాకు అప్పగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' (Make in India) ఆలోచన మంచిదే అయినా దానిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో సోమవారంనాడు చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ఉత్పత్తి రంగంలో భారత్ నిలదొక్కుకోలేకపోయిందని, అందువల్లే చైనా ఇక్కడ మకాం వేసిందని అన్నారు. ఇప్పటికైనా తయారీ రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉందన్నారు. సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తెలిపారు.

Delhi Elections: 'శీష్ మహల్‌'‌ను తెరుస్తాం: అమిత్‌షా


చైనా దిగుమతుల ప్రభావంపై భారతీయ యువత ఆందోళనకు కారణమవుతోందని, ఇందువల్ల ఎదురయ్యే సమస్యలను గుర్తెరిగి ఉత్పత్తిరంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' ఐడియా మంచిదే అయినా దాని ఫలితం కళ్లముందే ఉందన్నారు. 2014లో జీడీపీలో 15.3 శాతంగా ఉన్న మ్యాన్యుఫ్యాక్చరింగ్.. ఇవాళ 12.6 శాతంగా ఉందని, గత 60 ఏళ్లలో ఇది అత్యంత కనిష్టమని చెప్పారు. ప్రధానమంత్రిని తాను తప్పుపట్టడం లేదని, ఆయన ప్రయత్నించడం లేదని కూడా చెప్పనని, ఆయన ప్రయత్నించినా విఫలమయ్యారని చెప్పగలనని అన్నారు.


చైనా జోక్యంపై రాహుల్ మరింత వివరిస్తూ, ప్రస్తుతం ఇండియాలో చైనీయులు ఉన్నారని, కానీ ప్రధాని దానిని తోసిపుచ్చుతున్నారని, అయితే ప్రధాని వాదనపై ఆర్మీ ఏకీభవించడం లేదని అన్నారు. ''మొబిలిటీలో మార్పులకు నాలుగు టెక్నాలజీలు ప్రధానం. ఎలక్ట్రిక్ మోటార్స్, బ్యాటరీస్, ఆప్టిక్స్, వాటన్నింటికంటే టాప్‌లో ఏఐ ఉంటాయన్నారు. ఏఐ గురించి మాట్లాడేటప్పుడు అది సొంత ఏఐ కాకపోతే దానికి అర్ధం లేదు. ఎందుకంటే అది డాటాపై ఆపరేట్ అవుతుంది. ఇవాళ మనం డాటాను చూస్తే, ప్రొడక్షన్ సిస్టమ్ నుంచి వచ్చే ప్రతి సింగిల్ డాటా చైనాదే'' అని రాహుల్ అన్నారు.దేశంలోని యువతకు ఉద్యోగాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోందని రాహుల్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రతి ఏటా ఒకేలా ఉంటోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.


Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 04:28 PM