Share News

Delhi Elections: 'శీష్ మహల్‌'‌ను తెరుస్తాం: అమిత్‌షా

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:36 PM

జాంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, కేజ్రీవాల్‌కు ఒక ఇల్లుతో సంతృప్తి లేకనే 'అద్దాలమేడ' నిర్మించుకున్నారని చెప్పారు.

Delhi Elections: 'శీష్ మహల్‌'‌ను తెరుస్తాం: అమిత్‌షా

న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల ప్రజాధనంతో అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన ''శీష్ మహల్'' (Sheesh Mahal)ను ప్రజా సందర్శన కోసం తెరుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) హామీ ఇచ్చారు. రూ.51,000 కోట్ల ప్రజాధనంతో అద్దాలమేడ (శీష్ మహల్)ను కేజ్రీవాల్ నిర్మించారని అన్నారు. జాంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, కేజ్రీవాల్‌కు ఒక ఇల్లుతో సంతృప్తి లేకనే 'అద్దాలమేడ' నిర్మించుకున్నారని చెప్పారు.

Delhi Elections: సీఈసీకి బీజేపీ ఆఫర్..?: కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు


''ముఖ్యమంత్రి అయ్యాక ఇల్లు కానీ, కారు కానీ, సెక్యూరిటీ కానీ తీసుకోనని 2013లో కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆ తర్వాత కారు, బంగ్లా తీసుకున్నారు. ఒక బంగ్లాతో ఆయనకు తృప్తి కలగలేదు. దాంతో శీష్ మహల్ నిర్మించారు. అందుకైన రూ.51,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా ఢిల్లీ ప్రజలకు చెందిన సొమ్ము. శీష్ మహల్‌ను ప్రజాసందర్శన కోసం ఉంచుతామని నేను వాగ్దానం చేస్తున్నారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్‌కు తిరిగి ఓటు వేసి అధికారం కట్టబెట్టాలా?'' అని అమిత్‌షా ప్రశ్నించారు.


ప్రతాప్‌గంజ్ ప్రజలను మోసం చేసిన సిసోడియా

ప్రతాప్‌గంజ్ ప్రజలను మాజీ ఉమ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మోసం చేశారని అమిత్‌షా ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడంతో ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అనే భయంతో ఆయన ప్రతాప్ గంజ్ నియోజకవర్గాన్ని వదిలిపట్టి జాంగ్‌పురకు వెళ్లిపోయారని అన్నారు. ఇదే సిసోడియా డిప్యూటీ సీఎంగా ఆలయాలు, స్కూళ్లు, గురుద్వారాల సమీపంలో లిక్కర్ దుకాణాలు తెరిపించారని, దేశంలోనే ఒక లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన ఏకైక విద్యాశాఖ మంత్రి ఆయనేనని విమర్శించారు. బడే మియా (కేజ్రీవాల్) చోటో మియా (సిసోడియా) కలిసి ఢిల్లీ ప్రజలను వంచించారని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్‌!

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:39 PM