Udayanidhi: పిల్లల్ని కనండి కానీ...ఉదయనిధి నోట అదేమాట
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:56 PM
కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసిందనీ, ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

చెన్నై: జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడుకు లోక్‌సభ స్థానాలు తగ్గిపోతాయని డీఎంకే నేతలు ఒకరి వెంట మరొకరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పెళ్లయిన వారు వెంటనే పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల పిలుపునిచ్చారు. తాజాగా ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేశారు. సామూహిక వివాహాల కార్యక్రమంలో ఉదయనిధి బుధవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా పెళ్లయిన వారికి వెంటనే పిల్లల్ని కనాలని కోరారు. అయితే ఎక్కువ మందిని కనవద్దని సూచించారు.
Yogi Adityanath: ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది
"2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనం (డీఎంకే) 200కు పైగా గెలుస్తాం. కొత్తగా పెళ్లయిన వారు సాధ్యమైనంత త్వరతా పిల్లల్ని కోరుకోవాలని నా మనవి. కుటుంబ నియంత్రణను తమిళనాడు రాష్ట్రమే మొదటగా అమలు చేసింది. ఇందువల్ల మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాం'' అని ఉదయనిధి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య కంటే 8 వరకూ నియోజకవర్గాలు కోల్పోవచ్చని, జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 100 వరకూ పెరగవచ్చని చెప్పారు. తమిళ భాష అస్థిత్వం నిలిపేందుకు పుట్టబోయే పిల్లలకు తమిళం పేర్లే పెట్టాలని కూడా ఉదయనిధి కొత్త జంటలను కోరారు.
ఇవి కూడా చదవండి...
Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..
Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.