Yogi Adityanath: ఇస్లాం పుట్టక ముందే సంభాల్ ఉంది
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:48 PM
లక్నోలో బుధవారంనాడు మీడియాతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని చూసి తాము గర్విస్తున్నామన్నారు. యావత్ ప్రపంచ ఒకనాటికి సనాతన ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

లక్నో: ఇస్లాం (Islam) పుట్టకముందే సంభాల్ (Sambhal) పట్టణం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. సంభాల్ 5,000 ఏళ్ల క్రితం నాటిదని, హరి విష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేసినట్టు మత గ్రంథాలు చెబుతున్నాయని తెలిపారు. చారిత్రక సత్యానికి ప్రతీక సంభాల్ అని అభివర్ణించారు. అనేకసార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే తాను ప్రకటించానని అన్నారు. లక్నోలో బుధవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని చూసి తాము గర్విస్తున్నామన్నారు. యావత్ ప్రపంచ ఒకనాటికి సనాతన ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..
అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ...
''నేను ఒక యోగిని. అన్ని శాఖలు, మతాలను గౌరవిస్తాను. కానీ ఒకరి ఆరాధనా స్థలాన్ని మరొకరు బలవంతంగా ఆక్రమించుకోవడం, ఇతర విశ్వాసాలను ధ్వంసం చేయడం ఆమోదయోగ్యం కాదు. సంభాల్‌లో 68 యాత్రా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 18 ప్రాంతాలను మాత్రమే గుర్తించాం. సంభాల్‌లో శివాలయానికి 56 ఏళ్ల తర్వాత జలాభిషేకం నిర్వహించాం'' అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
కాంగ్రెస్ తొలి కుంభమేళాలో అవినీతి
ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహాకుంభ్‌ను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని యోగి ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. ఏమంచి జరిగినా దానిని వ్యతిరేకించడం వారికి అలవాటేనని అన్నారు. కాంగ్రెస్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 1954లో తొలి కుంభమేళా జరిగిందన్నారు. అప్పట్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ తర్వాత ప్రతి కుంభమేళాలోనూ ఇది జరుగుతూనే వచ్చిందన్నారు. అవినీతి, అరాచకాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఇది దాస్తే దాగే విషయం కాదన్నారు.
ఇవి కూడా చదవండి...
Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..
Election Commission: ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై చర్చిద్దాం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.