PM Modi: ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:17 AM
ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అని మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు.
అన్యాయంపై పగ తీర్చుకున్నాం : మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అని మోదీ తెలిపారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆపరేష్ సిందూర్, నక్సలిజం, జీఎ్‌సటీ సంస్కరణలు తదితర అంశాలను ప్రస్తావించారు. భారత్ తన ధర్మానికి కట్టుబడి ఉండే, అన్యాయంపై ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. ధర్మాన్ని నిలబెట్టాలని శ్రీరాముడు బోధించాడు. అన్యాయంపై పోరాడేందుకు ధైర్యాన్ని ఇచ్చాడు. దీనికి సజీవ ఉదాహరణను మనం కొన్నాళ్ల కిందట చూశాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా ధర్మాన్ని నిలబెట్టడమే గాక అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాం’ అని పేర్కొన్నారు. నక్సల్స్ హింసను వీడి జన జీవన స్రవంతిలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని స్వీకరించడం అతి పెద్ద విజయమన్నారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.