Share News

Pakistan Shelling Attack: రివేంజ్ స్టార్ట్..కశ్మీర్‌లో పాక్ కాల్పులు..15 మంది పౌరుల మృతి, 43 మందికి గాయాలు..

ABN , Publish Date - May 07 , 2025 | 08:46 PM

ఆపరేషన్ సిందూర్ ఘటన తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్ దాడుల్లో 15 మంది భారత పౌరులు మరణించగా, మరో 43 మంది గాయపడ్డారు.

Pakistan Shelling Attack: రివేంజ్ స్టార్ట్..కశ్మీర్‌లో పాక్ కాల్పులు..15 మంది పౌరుల మృతి, 43 మందికి గాయాలు..
Pakistan Shelling Kashmir

జమ్మూ కశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC), అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంబడి (Pakistan Shelling Attack) పాకిస్తాన్ బుధవారం షెల్లింగ్‌ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 15 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరిట బుధవారం తెల్లవారుజామున 1:05 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని 25 నిమిషాల పాటు ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడులు జైష్-ఏ-మహమ్మద్ (JeM), లష్కర్-ఏ-తొయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్ సహా పలు ఉగ్రసంస్థల శిబిరాలపై జరిగాయి.


పాక్ దాడులతో కశ్మీర్‌లో విధ్వంసం

పాకిస్తాన్, పీఓకెలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరగడం విశేషం. పాకిస్తాన్ భారీ షెల్లింగ్ దాడుల కారణంగా జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, తంగ్ధర్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో LoC, IB వెంబడి ఉన్న గ్రామాల్లోని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కిటికీల సమీపంలో గాజు శకలాలు చిందరవందరగా కనిపించాయి. ఈ దాడుల్లో సామాన్య పౌరులు తీవ్రంగా నష్టపోయారు.


పాక్ దళాలు

ప్రధానంగా పూంచ్ జిల్లాలోని సెంట్రల్ గురుద్వారా శ్రీగురు సింగ్ సభా సాహిబ్‌పై పాక్ దళాలు జరిపిన దాడిలో ముగ్గురు గురుసిఖ్‌లు మరణించారు. శిరోమణి అకాలీ దళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ ఘటనపై Xలో స్పందిస్తూ, మరణించిన వారిలో భాయ్ అమ్రీక్ సింగ్ జీ (రాగీ సింగ్), భాయ్ అమర్‌జీత్ సింగ్, భాయ్ రంజిత్ సింగ్ ఉన్నారని తెలిపారు. శిరోమణి అకాలీ దళ్ మరణించిన గురుసిఖ్‌ల కుటుంబాలకు పూర్తి సంఘీభావాన్ని తెలియజేసింది. ఈ బాధాకర సమయంలో బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని, వీరి త్యాగాన్ని గౌరవించాలని డిమాండ్ చేసింది.


పౌరుల భద్రతకు ప్రాధాన్యం

మరోవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో కాల్పులు కొనసాగిన నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా LoC, IB సమీపంలోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశించారు. ఆయన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌధరి, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్ ద్వారా నిరంతరం సంప్రదించారు. పౌరుల భద్రత భారత్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని షా అధికారులకు స్పష్టం చేశారు. అయినప్పటికీ పౌరులు మరణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..


Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన



Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 08:47 PM