Pakistan Cease Fire Violation: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్
ABN , Publish Date - May 12 , 2025 | 09:52 PM
Pakistan Cease Fire Violation: ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడిచింది. తాజాగా సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది.
న్యూఢిల్లీ, మే 12: ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తాజాగా తూట్లు పొడిచింది. సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. సాంబాతోపాటు కథువా, ఆర్ఎస్ పుర, ఉదంపూర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్లుతో పాకిస్థాన్ దాడికి దిగింది. వీటిని భారత్ సైన్యం తిప్పికొట్టంది. మరోవైపు ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం కొన్ని నిమిషాలకే పాక్ ఈ తరహా చర్యలకు దిగింది. ఇక పాకిస్థాన్‌తో సరిహద్దులుగా ఉన్న పంజాబ్ జిల్లాలతోపాటు రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్ విధించారు.
ఇంకో వైపు భారత్, పాకిస్థాన్‌లకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సోమవారం నిర్వహించిన కీలక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దుల్లో కాల్పులు, కవ్వింపులు ఉండరాదని నిర్ణయించారు. అలాగే ఇరువైపుల నుంచి ఒక్క బుల్లెట్ కూడా పేలకూడదని చర్చల్లో ప్రస్తావించారు. ఇరువైపుల నుంచి కవ్వింపు చర్యలు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల నుంచి బలగాలు తగ్గించాలని స్పష్టం చేసుకున్నారు. అలాగే బలగాల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకోవాలని వారు నిర్ణయించారు. ఈ డీజీఎంవో నిర్ణయాలు తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్థాన్ తన తెంపరితనాన్ని కాల్పుల విరమణ ఉల్లఘించడం ద్వారా చాటుకొంది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడి వెనుకు పాకిస్థాన్ ఉందనే బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వీటిని ప్రపంచం ముందు ఉంచింది. అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైతం అదే తరహాలో చర్యలు చేపట్టంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆ క్రమంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేశారు. దీనికి ఆపరేషన్ సిందూర్ అని భారత్ పేరు పెట్టింది. ఈ దాడి అనంతరం పాకిస్థాన్ సరిహద్దులుగా ఉన్న భారత్‌లోని పలు రాష్ట్రాలపై క్షిపణులు, డ్రోనులతో దాడి చేశారు. వీటిని భారత్ తిప్పికొట్టింది. దాదాపు నాలుగు రోజుల అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం చేసుకున్న అనంతరం పాక్ వరుసగా రెండో సారి ఉల్లంఘించినట్లు అయింది.
ఇవి కూడా చదవండి..
Kirana Hills: ఆ ఆయుధాలను పాక్ అక్కడే దాచిందా
Operation Sindoor: పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చిన భారత్
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ
For National News And Telugu News