Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ
ABN , Publish Date - May 12 , 2025 | 07:40 PM
Encounter: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు.
రాయ్‌పూర్, మే 12: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతోపాటు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలు తారసపడడంతో.. మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు.
దీంతో భద్రతా బలగాలు సైతం వెంటనే స్పందించి కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇరు వైపులా కొన్ని గంటల పాటు హోరా హోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. దాంతో భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. అందులోభాగంగా ఆ ప్రాంతంలో 20 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు కనుగోన్నాయి.
అయితే పలువురు మావోయిస్టులు పారిపోయినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆ క్రమంలో కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో మవోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులు నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఆ క్రమంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గడ్‌లో వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. దీంతో భద్రతా బలగాలకు వరుసగా కూబింగ్ నిర్వహిస్తోంది. దాంతో సదరు రాష్ట్రంలో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు.. భారీగా తమ సహచరులను కోల్పోయారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ కేంద్రం పిలుపు నిచ్చింది. తద్వారా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారికి పిలుపు నిచ్చింది. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే పోలీసులు, భద్రతా బలగాల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For National News And Telugu News