Share News

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..

ABN , Publish Date - May 21 , 2025 | 07:18 PM

శత్రుదేశం పాకిస్థాన్‌ను ఎవరూ నవ్వులపాలు చేయాల్సిన అవసరం లేదు. తమంతట తామే నవ్వులపాలవడం పాక్‌కు పరిపాటిగా మారింది. తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంది. అసలేం జరిగిందంటే..

Asim Munir: పరువు తీసుకుంటున్న పాక్ ఆర్మీ చీఫ్! మొహం ఎక్కడ పెట్టుకుంటాడో..
Pakistan

భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు హాస్యాస్పదంగా మారింది. తమ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించింది పాక్ మంత్రివర్గం. ఈ ఒక్క పనితో అటు అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులపాలైన శత్రుదేశం మీద ఇటు సోషల్ మీడియాలోనూ జోక్స్ పేలుతున్నాయి. భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్ సైన్యాన్ని నడిపించడంలో అసిమ్ మునీర్ దారుణంగా విఫలమయ్యారు. దీనికి తోడు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ వ్యవహారాల విషయంలో అసిమ్ మునీర్‌ పాత్ర లేకపోయినా ఆయనకు ఫీల్డ్ మార్షల్ పదవి ఇవ్వడంతో మరోమారు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నట్లయింది. దీంతో పాక్ మీద నెటిజన్స్ ఒక రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.


మైండ్ దొబ్బింది!

ఏం సాధించాడని అసిమ్ మునీర్‌కు ఈ పదవి కట్టబెట్టారని కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పాక్‌కు ఈ జన్మలో బుద్ధి రాదని.. కుక్క తోక వంకర, అది మారదంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఈయనో విఫల మార్షల్ అంటూ అసిమ్ మునీర్‌ను దుయ్యబడుతున్నారు నెటిజన్స్. ఆయన నియంతలా మారాడని మండిపడుతున్నారు. ఆర్మీ చీఫ్‌తో పాటు అడ్మిరల్ జనరల్, ప్రైమ్ మినిస్టర్, సుప్రీం కమాండర్, చీఫ్ ఎకనామిస్ట్, ఎలక్షన్ కమిషనర్, చీఫ్ చాన్సలర్.. ఇలా ఆ దేశంలోని అన్ని పోస్టులు ఆయనవేనని ఎద్దేవా చేస్తున్నారు. ఆర్మీని నడిపించడం చేతగాదు గానీ ఈ బిల్డప్‌లకు ఏమీ తక్కువ లేదని గాలి తీసేస్తున్నారు. భారత డ్రోన్లు, మిసైళ్ల దెబ్బకు పాకిస్థాన్‌కు మైండ్‌బ్లాంక్ అయిందని, అందుకే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

మావోలపై విజయం.. మోదీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.

సుదర్శన్ చక్ర ఎంత పదిలం

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ఏమన్నారంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 08:09 PM