Share News

Chennai Airport: దంపతులపై అనుమానం.. ఆపి తనిఖీ చేయగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:06 PM

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌలాలంపూర్‌ నుంచి చైన్నై వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బయటికి వెళ్లే క్రమంలో ఓ జంటను చూడగానే అధికారులకు అనుమానం కలిగింది. చివరకు క్షుణ్ణంగా పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Chennai Airport: దంపతులపై అనుమానం.. ఆపి తనిఖీ చేయగా షాకింగ్ సీన్..

అక్రమ వ్యాపారానికి విమానాశ్రయాలు అడ్డాలుగా మారుతున్నాయి. కొందరు నేరస్థులు నిషేధిత వస్తువులను ఎంతో తెలివిగా తరలిస్తూ చివరకు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇంకొందరు ఎలాగైనా పోలీసుల కంట పడకూడదనే ఉద్దేశంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు డ్రగ్స్, బంగారం, వివిధ రకాల జంతువులను విచిత్రమైన పద్ధతుల్లో తరలించడం చూస్తుంటాం. తాజాగా, ఓ జంట బంగారం తీసుకొచ్చిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. అలాగే ఓ నైజీరియన్ మహిళ నుంచి భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chennai International Airport) ఈ ఘటన చోటు చేసుకుంది. కౌలాలంపూర్‌ నుంచి చైన్నై (Kuala Lumpur to Chennai) వచ్చిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బయటికి వెళ్లే క్రమంలో ఓ జంటను చూడగానే అధికారులకు అనుమానం కలిగింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారి సమాధానాలు విని అనుమానం మరింత బలపడింది. చివరకు మొత్తం చెక్ చేయగా షాకింగ్ దృశ్యం కనిపించి. ఆ దంపతులు తమ చెప్పులు, శరీరంలో బంగారం (Gold hidden in sandals and body) దాచినట్లు గుర్తించారు. దాని విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. సదరు దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


నైజీరియన్ మహిళను చెక్ చేయగా..

ఎయిర్‌పోర్ట్ అధికారులు భారీగా కొకైన్‌ను సీజ్ చేశారు. ఏఐయూ, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 2 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ రాజధాని దోహా నుంచి చైన్నై వచ్చిన విమానంలో ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా.. అధికారులకు ఓ నైజీరియన్ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. 30 ఏళ్ల నైజీరియన్ మహిళ ఆఫ్రికా నుంచి దోహా మీదుగా చైన్నైకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చి.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.


ఆమె వస్తువులను మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా నల్ల రంగులో ఉన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. అందులో చూడగా కొకైన్ బయటపడింది. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ కేసులో నైజీరియా మహిళకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. వీరికి చెన్నైలో ఏదైనా ముఠాతో సంబంధం ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 01:06 PM