Raind: 3 వరకు మోస్తరు వర్షాలు..
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:35 PM
తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.
చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి(Tamil Nadu, Puducheri)లో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ(Kakinada) సమీపంలో తీరం దాటిందన్నారు. అలాగే, మధ్య తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని, రాబోయే 36 గంటల్లో అల్పపీడనం కదిలే అవకాశముందని భావిస్తున్నట్లు తెలిపింది.

తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరిలలో గురువారం నుంచి మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాజధాని నగరం చెన్నై(Chennai), శివారు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News