Share News

Maoists: దూసుకొస్తున్న దళాలు.. మావోయిస్ట్ పార్టీ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:38 PM

ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోంది. అలాంటి వేళ.. మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

Maoists: దూసుకొస్తున్న దళాలు.. మావోయిస్ట్ పార్టీ కీలక నిర్ణయం..
Maoists

ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 09: ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం పక్కా వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. ఈ ఘటనల్లో వందలాది మంది మావోయిస్టులు మరణిస్తున్నారు. దీంతో మావోయిస్టులకు భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

అలాంటి వేళ.. మావోయిస్టులు సైతం వెనకడుగు వేయడం లేదు. తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవ్ జి నియమించింది. ఈ ఏడాది మే 21వ తేదీ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రధాన కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. తిరుపతి అలియాస్ దేవ్ జిని ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎంపిక చేసింది. మరోవైపు గెరిల్లా సుప్రీం లీడర్ మాడవి హిడ్మాకు బస్తర్ కమాండర్‌గా బాధ్యతలు అప్పగించింది.


తిరుపతి నేపథ్యం ఇదీ..

తిరుపతి స్వస్థలం.. తెలంగాణలోని కోరుట్ల అంబేద్కర్ నగర్‌. తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికట్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్‌యూ) భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత 1983 ఏడాది చివరిలో తిరుపతి అజ్జాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పని చేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా, మిలిషియా దాడుల్లో కీలక వ్యూహకర్తగా తిరుపతి పేరు పొందారు.


లక్ష్యంతో వెళ్తున్న కేంద్రం..

2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో కేంద్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు పలువురు మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. దీంతో వారి పునరావాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే వివిధ సందర్భాల్లో మావోయిస్టులను అరెస్ట్ చేసింది.


అయితే దేశంలో దాదాపుగా మావోయిస్టులు లేకుండా పోయారు. కానీ వీరి ప్రభావం ఛత్తీస్‌‌గఢ్‌లో అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దండకారణ్యంలో భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దండకారణ్యంలోని అధిక భాగాన్ని భద్రతా దళాలు.. తమ చేతిలోకి తీసుకున్నాయి. అలాంటి వేళ.. మావోయిస్టులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియస్ దేవ్ జిని ఎంపిక చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి..

మరాఠాలకు మోదీ బర్త్ డే గిఫ్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..

దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 06:35 PM