Jaisalmer: కదులుతున్న బస్సులో మంటలు.. 15 మంది సజీవదహనం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:58 PM
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చారు.
జైసల్మేర్: రాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer)లో మంగళవారంనాడు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు వెంటనే బస్సులు నిలిపివేశారు. నేషనల్ హైవేపై బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో కిలోమీటర్ల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని అర్మీ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి చుట్టుపక్కలకు మంటలు విస్తరించకుండా వెంటనే అదుపులోనికి తెచ్చాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు.
ఇవి కూడా చదవండి..
71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి.. రాహుల్ డిమాండ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి