Chhattisgarh: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత.. ఆ కొద్ది సేపటికే..
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:28 PM
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ కొద్ది సేపటికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిల్వ ఉంచి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్, అక్టోబర్ 14: ఆపరేషన్ కగార్ లక్ష్యంగా భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో దూసుకు పోతున్నాయి. అందులో భాగంగా కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ క్రమంలో మావోయిస్టులు దాచి ఉంచిన పేలుడు పదార్థాలను భారీగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. 51 లైవ్ బిజిఎల్.. 100హెచ్డీ అల్యూమినియం వైర్ కట్టలు, 50పైపులతోపాటు భారీగా ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
సీఆర్పీఎఫ్ 229,153,196, తడ్పల బేస్ క్యాంపు నుండి కోబ్రా 206 సంయుక్తంగా ఈ కూంబింగ్‌లో పాల్గొన్నాయి. అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరాయంగా సోదాలు నిర్వహిస్తూ.. మావోయిస్టులు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరో వైపు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 60 మంది మావోయిస్టులతో కలిసి మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎదుట ఆయన లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుదల చేసిన విషయం విదితమే.
2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలో మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యాన్ని సైతం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఇప్పటికే భద్రత బలగాల చేతిలో వందలాది మంది మావోయిస్టులు మరణించగా.. పలువురిని అరెస్ట్ చేశారు. ఇక మృతి చెందిన మావోయిస్టుల జాబితాలో ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం మావోయిస్టు అగ్రనేత లొంగిపోయిన కొద్దిసేపటికే వారు నిల్వ ఉంచి ఆయుధాలను సైతం భద్రతా బలగాలు భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం
కొత్త డీజీపీగా ఓం ప్రకాశ్ సింగ్
దీపావళి పండగ ఎప్పుడు చేసుకోవాలి..?
For More National News And Telugu News