Share News

Udayanidhi Stalin: ప్రేమపెళ్లి బహుకష్టం...

ABN , Publish Date - Dec 05 , 2025 | 12:19 PM

ఈ రోజుల్లో ప్రేమపెళ్లి బహుకష్టం.. అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. కార్తిక అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనే ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న వారు ఒకింత నవ్వుకోవడం కనిపించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.

Udayanidhi Stalin: ప్రేమపెళ్లి బహుకష్టం...

- వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయనిధి

చెన్నై: ప్రేమించి పెళ్లిచేసుకోవడం బహుకష్టమని ఓ వివాహ వేడుకలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi Stalin) వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. విరుదునగర్‌ జిల్లా శివకాశి కార్పొరేషన్‌ మేయర్‌ సంగీత ఇంట గురువారం జరిగిన వివాహ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా భారీవర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా తప్పని పరిస్థితుల్లో ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నట్లు చెప్పారు.


nani1.2.jpg

వధూవరులు ప్రేమికులని తెలిసిందని, ప్రేమించిన వ్యక్తిని మనువాడటం మహా కష్టమని, అయితే పిల్లలను అర్థం చేసుకునే తల్లిదండ్రులు వుంటే ప్రేమ జంట జీవితం సాఫీగా సాగుతుందని తెలిపారు. కాగా, ఉదయనిధి తన సతీమణి కార్తికను ప్రేమించి పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే.


nani1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

వాడూ.. వీడూ.. ఎవడు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 05 , 2025 | 12:19 PM