Satadru Dutta: మెస్సి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుకు బెయిల్ నిరాకరణ
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:44 PM
నిర్వహణలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరిచారు.
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాటల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్' నిర్వాహకుడు శతద్రు దత్తా (Satadru Dutta)కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు.
ఈనెల 13న తొలిరోజు పర్యటనలో భాగంగా సాల్ట్‌లేక్ స్టేడియానికి మెస్సి వచ్చారు. అయితే చెప్పిన సమయం కంటే అతి తక్కువ సమయం గడపటం, చూసేందుకు అవకాశం లేకపోవడంతో మెస్సి అభిమానులు రెచ్చిపోయారు. సీసాలు, ప్లాస్టిక్ కూర్చీలు స్టేడియంలోకి విసిరేయడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిర్వహణాలోపం కారణంగా గందరగోళానికి కారణమయ్యాడనే ఆరోపణపై శతద్రును హైదరాబాద్ వెళ్తుండగా ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులో హాజరు పరచగా, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ 14 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆదివారంనాడు స్డేడియంను పరిశీలించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కాగా, మెస్సి తొలిరోజు పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో పుట్‌బాల్ ఆడారు. పలువురు పిల్లలు కూడా పాల్గొన్నారు. రెండో రోజైన ఆదివారంనాడు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో అభిమానులను మెస్సి కలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మెక్సికో 50 శాతం టారీఫ్‌లు.. తగిన చర్యలు తీసుకుంటామన్న భారత్
విమానంలో అమెరికా మహిళకు అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి