Kolkata Crime: అమ్మమ్మతో నిద్రిస్తున్న 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. ఆపై అత్యాచారం..
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:16 AM
కోల్‌కతా ప్రాంతాల్లో తారకేశ్వర్ రైల్వే షెడ్‌లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నేటికాలంలో పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు.. ఎవరికీ రక్షణ లేకుండా పోతుంది. ముఖ్యంగా కొందరు పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా కోల్ కతా( Kolkata)లో దారుణం చోటుచేసుకుంది. కోల్‌కతా సమీపంలోని హుగ్లీలో తన అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రారంభం..
కోల్‌కతా( Kolkata Crime) ప్రాంతాల్లో తారకేశ్వర్ రైల్వే షెడ్‌లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్(Girl Kidnap) చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక శనివారం మధ్యాహ్నం తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో రక్తపు మడుగులో చిన్నారి స్థానికులకు కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. బాధితురాలిని వెంటనే తారకేశ్వర్ ప్రాంతీయ ఆస్పత్రికి చేర్చి.. చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోక్సో చట్టం(POCSO Act) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి అమ్మమ్మ మాట్లాడింది. 'నా మనవరాలు నాతో నిద్రపోతోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరో ఆమెను తీసుకెళ్లారు. ఆమెను ఎప్పుడు తీసుకెళ్లారో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. ఆమెను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా ఎవరో నాకు తెలియదు. వారు మేము నిద్రిస్తున్న మంచానికి ఉన్న దోమతెరను కోసి తీసుకెళ్లారు. చివరకు నా మనవరాలు నగ్నంగా కనిపించింది' అని బాలిక అమ్మమ్మ కన్నీరుమున్నీరు అయింది. తమకు ఇళ్లు లేవని, ఉన్న ఇళ్లన కూల్చివేయడంతో ఇలా వీధుల్లో ఉంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై మమతా ప్రభుత్వం(Mamata Banerjee)పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'తారకేశ్వర్‌లో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కుటుంబం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తారకేశ్వర్ పోలీసులు నేరస్థులను తప్పించే పనిలో బిజీగా ఉన్నారు. ఇది మమతా బెనర్జీ పాలన. ఈ ఘటనతో పోలీసులు నిజాన్ని అణిచివేయడం ద్వారా శాంతి భద్రతలు కాపాడుతున్నట్లు చూపిస్తున్నారు" అని బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
వారానికి మూడుసార్లు జంక్‌ఫుడ్
కిషన్‌రెడ్డి, రేవంత్‌ది ఫెవికాల్ బంధం: హరీశ్