Kalvakuntla Kavitha: నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది: కవిత
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:07 AM
నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించి వాటి సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానన్నారు.
హన్మకొండ, నవంబర్ 9: జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులో వర్సిటీ విద్యార్థులతో శనివారం రాత్రి చాయ్ పే చర్చ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి చాయ్ తాగి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇతర అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్ కన్నా ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశమని కవిత ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కచ్చితంగా పోరాటం చేస్తానని.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామంటే నమ్మి మోసపోయామని నిరుద్యోగులు చెబుతున్నారని అన్నారు. నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ల ప్రక్రియ పూర్తి చేసి అవన్నీ తాము ఇచ్చిన ఉద్యోగాలుగా చెప్పుకుంటుందన్నారు. నిరుద్యోగుల సమస్యలతో పాటు జోనల్ వ్యవస్థ అంశాలపై పోరాడాలని కవితకు సూచించారు. రాష్ట్రంలో మళ్లీ అధికార మార్పిడి జరగాలని.. అప్పుడే నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
వారానికి మూడుసార్లు జంక్‌ఫుడ్
కిషన్‌రెడ్డి, రేవంత్‌ది ఫెవికాల్ బంధం: హరీశ్