BRS leader Harish Rao: కిషన్‌రెడ్డి, రేవంత్‌ది ఫెవికాల్ బంధం
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:51 AM
కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిది ఫెవికాల్ బంధమని, బీజేపీతో అంటకాగుతున్న సీఎం.. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు.....
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం.. ఉత్తి మాటే: హరీశ్
హైదరాబాద్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిది ఫెవికాల్ బంధమని, బీజేపీతో అంటకాగుతున్న సీఎం.. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దొంగే దొంగ అన్నట్టుగా సీఎం తీరు ఉందని విమర్శించారు. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారన్న ఆరోపణలతో ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని, గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగాయని.. ఆ వివరాలు ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం ఉత్తి మాటేనని విమర్శించారు. కాంగ్రెస్ చేతలన్నీ బడా బాబులకు వంత పాడేలా ఉన్నాయని మండిపడ్డారు. ‘‘రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రెండు రూపాయలూ ఇవ్వని కాంగ్రెస్ సర్కారు.. బడా కాంట్రాక్టర్లకు మాత్రం భారీగా బిల్లులు చెల్లించింది. సీఎంకు పిల్లల చదువులు ముఖ్యమా? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లు ముఖ్యమా?’’ అని నిలదీశారు. ఉద్యోగులకు ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. పీజేఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రె్‌సకు లేదన్నారు. అంబేడ్కర్ పేరుందనే సచివాలయానికి రావడం లేదని ఆరోపించారు. వెంకటేశ్వరస్వామి కల్యాణం పేరుతో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ చీరలు, సారెలు పంచుతోందని, ఎన్ని చేసినా ఓటర్లు లైన్లు కట్టి బీఆర్‌ఎ్‌సకే ఓటేయాలని డిసైడ్ అయ్యారన్నారు. కాగా, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి.. మోదీ శిష్యులేనని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రణాళికా బద్ధంగా అక్రమాలకు పాల్పడుతోందని దాసోజు శ్రావణ్ కుమార్ ఆరోపించారు.