Share News

RSS Meet in Jodhpur: ఆర్ఎస్ఎస్ కీలక మీట్... కొలిక్కి రానున్న బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:46 PM

మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్‌లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.

RSS Meet in Jodhpur: ఆర్ఎస్ఎస్ కీలక మీట్... కొలిక్కి రానున్న బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక
Mohan Bhagwat

న్యూఢిల్లీ: బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలోనే ఎంపిక చేయన్నారనే ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (RSS) మూడ్రోజుల సమన్వయ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించింది. సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకూ జోథ్‌పూర్‌ (Jodhpur)లో ఈ కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి చర్చించే అవకాశం ఉంది.


హేమాహేమీలు

మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్‌లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు. ఆర్ఎస్ఎస్ సబ్-ఆర్గనైజేషన్ల అధిపతులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా ఇందులో పాల్గొంటారు.


ఆర్ఎస్ఎస్ కీలక సమావేశంలో బీజేపీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసి కల్యాణ్ అండ్ సేవాసమితి సహా 32 సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత హెడ్ బీఎల్ సంతోష్‌తో పాటు సునీల్ బన్సాల్, శివ్‌ప్రకాష్, సౌదాన్ సింగ్, వి.సతీష్ వంటి నేతలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో అన్ని ఆర్గనైజేషన్లు తమ ఏడాది నివేదికలను సమర్పిస్తారు. అమెరికా వాణిజ్య సుంకాలు సహా సమకాలీన అంశాలపై మూడ్రోజుల సమావేశాల్లో చర్చిస్తారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది కార్యక్రమాల సన్నాహకాలపై కూడా చర్చించనున్నారు.


ఇవి కూడా చదవండి..

మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు

రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో మళ్లీ అపశృతి

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 09:48 PM